Fauzi: భగవద్గీత కోడ్‌తో బ్రిటిషర్లను వణికించిన ప్రభాస్

ABN , Publish Date - Oct 23 , 2026 | 10:10 PM

పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఇస్తున్న సర్‌ప్రైజ్‌లు అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇప్పటికే స్పిరిట్ సినిమాకు సంబంధించి వంగా పోస్ట్ వైరల్ అవుతుండగా, తాజాగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్యాట్రియాటిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ(Fauzi)

పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఇస్తున్న సర్‌ప్రైజ్‌లు అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇప్పటికే స్పిరిట్ సినిమాకు సంబంధించి వంగా పోస్ట్ వైరల్ అవుతుండగా, తాజాగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్యాట్రియాటిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ(Fauzi) నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది.  ఫైల్ నెం. 25 : ఫౌజీ' (File no. 25 : FAUZI) పేరుతో విడుదల చేసిన ఈ గ్లింప్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్ర గ్లింప్స్ ఒక సరికొత్త చారిత్రక నేపథ్యంతో ప్రారంభమైంది. సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే సంభాషణతో టీజర్ హై-వోల్టేజ్ మూడ్‌లోకి వెళ్లింది. బ్రిటీష్ వారిపై పోరాడటానికి జర్మనీ సహాయం కోరిన సుభాష్ చంద్రబోస్‌తో హిట్లర్ మాట్లాడే సీన్ తో గ్లింప్స్ మొదలయ్యింది. బ్రిటీష్ సైనిక ఇంటెలిజెన్స్‌ను గడగడలాడించిన ఒకే ఒక్క భారతీయుడు, సోల్జర్, స్ట్రాటజిస్ట్ అండ్ స్పై అయిన  ఫౌజీ పాత్ర చుట్టూ ఈ కథ నడుస్తుందని టీజర్ స్పష్టం చేసింది.


భగవద్గీత ఆధారంగా ఎన్విగ్మా  కోడ్‌ను మించిన అభేద్యమైన కోడ్‌ను సృష్టించిన ఆ రహస్య వీరుడిగా ప్రభాస్ ఎంట్రీ ఇస్తుండటం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది . టీజర్ చివరిలో ప్రభాస్ పలికిన ' అబే ఓ ఫిరంగీ.. నీ రక్తంతో తడిపి నా దేశానికి స్వాతంత్య్రం తెస్తా 'అనే పవర్‌ఫుల్ డైలాగ్, ఆయన మాస్ యాక్షన్ ప్రెజెన్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.ఈ భారీ ప్రాజెక్ట్‌ను 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హను రాఘవపూడి మార్క్ మేకింగ్, ఎపిక్ పీరియడ్ బ్యాక్‌డ్రాప్, ప్రభాస్ ఫౌజీ గెటప్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని స్పష్టమవుతోంది. మరి ఈ సినిమాతో  ప్రభాస్ ఎన్ని రికార్డులు తిరగరాస్తాడో చూడాలి. 

Updated Date - Oct 23 , 2026 | 10:16 PM