Fauzi: ‘ఫౌజీ’లో హైఓల్టేజ్ యాక్షన్.. మూడు వారాల పాటు భారీ షెడ్యూల్
ABN , Publish Date - Aug 09 , 2026 | 10:47 AM
ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’ (Fauzi). టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వి కథానాయికగా నటిస్తున్నారు.
ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’ (Fauzi). టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వి కథానాయికగా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో మిగిలిన సన్నివేశాలను వేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు.
సుమారు మూడు వారాలపాటు ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్లు సమాచారం. ఈ భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. చారిత్రక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ పాత్రను దర్శకుడు హను రాఘవపూడి ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ‘ఫౌజీ’ని డిసెంబరు 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.