Fauzi : సీక్వెల్ స్టార్ గా మారిపోతున్న ప్రభాస్
ABN , Publish Date - Oct 25 , 2025 | 06:26 PM
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు సీక్వెల్ స్టార్ గానూ మారిపోయాడు. 'బాహుబలి' రెండు భాగాలు ఘన విజయం సాధించిన తర్వాత 'సలార్, కల్కి 2898 ఎ.డి.' చిత్రాలకూ సీక్వెల్స్ వస్తున్నాయి. ఈ జాబితాలోకే 'ఫౌజీ' చిత్రం చేరబోతోందట.
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఇప్పుడు సీక్వెల్ మూవీస్ స్టార్ గా మారిపోయాడు. ఎందుకంటే... 'బాహుబలి' (Baahubali) సినిమాలు రెండు భాగాలుగా విడుదలై ఒక దానిని మించి మరొకటి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రభాస్ తో సినిమాలు తీస్తున్న మేకర్స్ సీక్వెల్స్ ను చేయడానికి తహతహలాడుతున్నారు. ప్రభాస్ నటించిన 'సలార్' (Salaar) మూవీకి సీక్వెల్ ఉంటుందని ముందే చెప్పేశారు. అలానే 'కల్కి 2898 ఎ.డి.' (Kalki 2898 A.D) కీ సీక్వెల్ ఉంటుందని చెప్పారు. అంతే కాదు... అది మూడు భాగాలు తీసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదిలా ఉంటే ప్రభాస్ ఇప్పుడు నటిస్తున్న 'ది రాజా సాబ్' (The Raja Saab) కూ సీక్వెల్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అయితే... ప్రభాస్ తో 'ఫౌజీ' మూవీని తెరకెక్కుస్తున్న హను రాఘవపూడి తమ చిత్రానికి ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుందని బల్లగుద్ది మరీ చెబుతున్నాడట.
'ఫౌజీ' అనేది ఫ్రాంచైజ్ లో తొలి భాగం మాత్రమేనని కొద్ది రోజులుగా ఫిల్మ్ నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై హను రాఘవపూడి ప్రభాస్ తోనూ మాట్లాడని తెలుస్తోంది. ఇందులో మొదటి భాగం ప్రభాస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రూపుదిద్దుకుంటుండగా, సీక్వెల్ మరో డైమన్షన్ లో ఉండబోతోందట. చరిత్రలో జరిగిన నిజ సంఘటనల నేపథ్యంలో హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 'ఫౌజీ'లోని పాత్రను కేవలం ఒక సినిమాకే పరిమితం చేయకుండా ఈ ఫ్రాంచైజ్ లో హను మరికొన్ని సినిమాలు తీయాలని అనుకోవడం ఆయన అభిమానులను ఆనంద పరిచే వార్తే! ఇదిలా ఉంటే ప్రభాస్ వరుసగా సీక్వెల్స్ చేస్తుండటంతో తెలుగులో అత్యధికంగా సీక్వెల్స్ చేస్తున్న స్టార్ హీరోగానూ ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచినట్టు అయ్యింది.
Also Read: Rashmika Mandanna: నా టైప్ ఎవరో అందరికీ తెలుసు..
Also Read: Bollywood: హాస్యనటుడు సతీశ్ షా మరి లేరు...