క్లాస్ డైరెక్టర్ ‘వైల్డ్’ ప్లాన్.. ఈసారి రెబల్ స్టార్ కటౌట్‌కు పూనకాలే!

ABN , Publish Date - Apr 17 , 2026 | 10:43 PM

ఆరడుగుల రెండంగుళాల భారీ కటౌట్.. వెండితెరపై కనిపిస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డుల గర్జన వినిపిస్తుంది. అతనే రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలియంది కాదు.

Prabhas Fauzi Update

ఆరడుగుల రెండంగుళాల భారీ కటౌట్.. వెండితెరపై కనిపిస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డుల గర్జన వినిపిస్తుంది. అతనే రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas). ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలియంది కాదు. అయితే అభిమానులు ప్రభాస్ నుంచి కేవలం నటనను మాత్రమే కాదు, అంతకుమించిన వీరవిధ్వంసాన్ని కోరుకుంటారు. దానికి సాక్ష్యమే ‘సలార్’ (Salaar). ఆ సినిమాలో ప్రభాస్ మాటలు తక్కువ యాక్షన్‌ ఎక్కువ అనే రీతిలో నటించేశారు. ‘సలార్‌’ సినిమా రిలీజై రెండేళ్లు దాటినా ప్రభాస్‌ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఇంకా ఫ్యాన్స్ గుండెల్లో రిపీట్ మోడ్‌లో మోగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఒక వైల్డ్ యాంగిల్‌ను టచ్ చేయడానికి సిద్ధమయ్యారు క్లాస్ డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi).


సాధారణంగా హను రాఘవపూడి అనగానే.. ‘అందాల రాక్షసి’, ‘సీతారామం’ వంటి చిత్రాలు గుర్తొస్తాయి. మెలోడీలు, సున్నితమైన ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హను, ఇప్పుడు ప్రభాస్ కోసం తన రూటు మార్చారు. ‘ఫౌజీ’ (Fauzi) చిత్రంతో తనలోని అసలైన మాస్ డైరెక్టర్‌ను పరిచయం చేయబోతున్నారు. ఈ సినిమా కేవలం ఒక పెట్రియాటిక్ డ్రామా మాత్రమే కాదు.. ఇందులో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ నెవర్ బిఫోర్ అనే రేంజ్‌లో ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. ఒకవైపు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమాతో ప్రభాస్‌ను అత్యంత వైల్డ్‌గా చూపించడానికి సిద్ధమవుతున్నారు. ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ సినిమాలతో హింసను కూడా ఒక స్టైలిష్ యాంగిల్‌లో చూపించిన ఘనత సందీప్‌ది. ఇప్పుడు హను రాఘవపూడి కూడా అదే రేంజ్‌లో పోటీ పడుతుండటం విశేషం. ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమేమిటంటే.. హను స్క్రీన్‌ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. దీనికి తోడు యుద్ధ నేపథ్యం ఉన్న కథ కావడంతో, ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను హను డిజైన్ చేస్తున్నారట.


ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వీ ఇస్మాయిల్ నటిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరిద్దరి పోస్టర్లు చూస్తుంటే, సినిమాలో కెమిస్ట్రీతో పాటు ఒక పీరియడ్ ఎమోషన్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుందని అర్థమవుతోంది. కేవలం సాఫ్ట్ లుక్‌కే పరిమితం కాకుండా, యుద్ధ రంగంలో ప్రభాస్ చేసే పోరాటాలు థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయమని అంటున్నారు. మేకర్స్ ఇచ్చిన లీకుల ప్రకారం.. ఈ సినిమాలో ఉండే యాక్షన్ సీన్లు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయట. హను రాఘవపూడి ఫిల్మ్ మేకింగ్‌లో ఉండే విజువల్ గ్రాండియర్, ప్రభాస్ మాస్ ఇమేజ్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం ఖాయం. ఇప్పటివరకు ప్రభాస్‌ను ఒక పోరాట యోధుడిగా చూశారు.. కానీ ఒక సైనికుడిగా, దేశం కోసం పోరాడే వైల్డ్ మ్యాన్‌గా ‘ఫౌజీ’లో చూడబోతున్నారనేలా టీమ్ కూడా చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

విష్ణుప్రియ దారిలోనే మరికొందరు.. ఆ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే.

మంగ్లీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!

Balakrishna: ‘రూటు’ మార్చిన బాలయ్య.. కొడుకు కథను పక్కన పెట్టి.. తనే ఆ దర్శకుడితో?

Updated Date - Apr 17 , 2026 | 10:43 PM

Fauzi : సీక్వెల్ స్టార్ గా మారిపోతున్న ప్రభాస్

Fauzi: 'ఫౌజీ' యంగ్ ప్రభాస్‌గా.. సుధీర్ బాబు చిన్న కొడుకు!

Fauzi: చరిత్రలో దాగిన అధ్యాయాల్లో.. అత్యంత ధైర్యవంతుడు 

Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగ.. రెండు భాగాలుగా ఫౌజీ

Prabhas: ఏళ్ల పాటు ఎదురుచూడాల్సిన అవసరం లేదు