Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగ.. రెండు భాగాలుగా ఫౌజీ
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:03 PM
ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాకు సీక్వెల్ ఉంటుంది. లేకపోతే ఫ్రీక్వెల్ ఉంటుంది. కథను మూడు గంటల కంటే ఎక్కువ చెప్పాల్సి వస్తే డైరెక్టర్స్ రెండో భాగాన్ని ఎంచుకుంటున్నారు.
Fauzi: ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాకు సీక్వెల్ ఉంటుంది. లేకపోతే ఫ్రీక్వెల్ ఉంటుంది. కథను మూడు గంటల కంటే ఎక్కువ చెప్పాల్సి వస్తే డైరెక్టర్స్ రెండో భాగాన్ని ఎంచుకుంటున్నారు. బాహుబలి సినిమాతో ట్రెండ్ సృష్టించిన ఈ రెండు భాగాల విధానం.. ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. కథ ఉన్నా.. లేకున్నా రెండు పార్ట్స్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక టాలీవుడ్ లో రెండు భాగాలుగా వస్తున్న సినిమాలు అన్ని ప్రభాస్ (Prabhas) వే కావడం విశేషం.
బాహుబలి, సలార్, కల్కి 2898ఏడి .. ఇవన్నీ సీక్వెల్స్ ని ప్రకటించినవే. ఇక ఇప్పుడు అందులో మరో సినిమా కూడా యాడ్ అయ్యింది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫౌజీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి నటిస్తుండగా.. మిథున్ చక్రవర్తి, జయప్రద, రాహుల్ రవీంద్రన్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
ఈమధ్యనే ఫౌజీ నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై హైప్ ను పెంచేసింది. ఇక మొదటినుంచి ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ఉంటుందని వార్తలు వచ్చినా మేకర్స్ క్లారిటీఇవ్వకపోవడంతో అవి రూమర్స్ అనుకున్నారు. కానీ, డైరెక్టర్ హనునే అధికారికంగా ఫౌజీ రెండు భాగాలుగా తెరకెక్కుతుందని తెలిపాడు. అయితే.. రెండో భాగం ఫౌజీ ఫ్రీక్వెల్ గా వస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక ఫ్రీక్వెల్ కథ పూర్తిగా భిన్నంగా ఉంటుందని.. అందులో యాక్షన్, డ్రామా మరింత ఎక్కువ ఉంటుందని హామీ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరి ఇన్ని సీక్వెల్స్ ని, ఫ్రీక్వెల్ ని డార్లింగ్ ఎప్పుడు పూర్తిచేస్తాడో చూడాలి.