Prabhas: ఏళ్ల పాటు ఎదురుచూడాల్సిన అవసరం లేదు

ABN , Publish Date - May 06 , 2024 | 09:58 AM

డార్లింగ్‌ ప్రభాస్‌ షెడ్యూల్‌ చాలా బిజీగా ఉంది. వరుసగా మూడు చిత్రాల షూటింగ్‌తో ఆయన క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం ‘రాజాసాబ్‌’ సినిమాలో నటిస్తున్న ఆయన... ఒప్పుకున్న మరో రెండు కొత్త చిత్రాల్నీ ఏకకాలంలో సెట్స్‌పైకి తీసుకెళుతున్నారు

Prabhas:  ఏళ్ల పాటు ఎదురుచూడాల్సిన అవసరం లేదు

డార్లింగ్‌ ప్రభాస్‌ (Prabhas) షెడ్యూల్‌ చాలా బిజీగా ఉంది. వరుసగా మూడు చిత్రాల షూటింగ్‌తో ఆయన క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం ‘రాజాసాబ్‌’ (Raja saab)సినిమాలో నటిస్తున్న ఆయన... ఒప్పుకున్న మరో రెండు కొత్త చిత్రాల్నీ ఏకకాలంలో సెట్స్‌పైకి తీసుకెళుతున్నారు. హను రాఘవపూచిడి (Hanu raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్‌ సినిమాని జులైలోనే ప్రారంభించనున్నారు. దీంతోపాటు, ‘సలార్‌ 2’ (Salaar 2)చిత్రీకరణకీ సై అంటున్నారు. వచ్చే నెల నుంచి ప్రభాస్‌ లేకుండానే ‘సలార్‌2’ చిత్రీకరణని మొదలు పెట్టనున్నారు. తొలుత ఆయన లేని సన్నివేశాలను చిత్రీకరించడానికి  దర్శకుడు ప్రశాంత్  నీల్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఆయన జులై నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనున్నట్టు తెలిసింది.

Prabhas.jpg

అంటే ఒకే నెలలో రెండు సినిమాలు షురూ అవుతాయన్నమాట. మరోవైపు కల్కి, ‘రాజాసాబ్‌’ చిత్రీకరణనీ పూర్తి చేయనున్నారు. ఈ ఏడాదిలోనే సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమానీ ప్రారంభిస్తారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందీప్‌ చెప్పారు. వరుస సినిమాలు, డిఫరెంట్‌ జానర్లతో ప్రేక్షకుల్ని ప్రభాస్‌ అలరించనున్నారు. ఏడాదికి ఒక సినిమా చేసే ప్రభాస్‌ ఇప్పుడు వరుసగా సెట్స్‌ మీద సినిమాలు ఉంచడంతో అభిమానులు ఎంతో ఆనందిస్తున్నారు. ఏళ్ల తరబడి ఎదురు చూసే అవసరం లేకుండా వెంట వెంటనే తన సినిమాలతో సందడి చేయడానికి ప్రభాస్‌ సంసిద్ధంగా ఉన్నారు. 

Updated Date - May 06 , 2024 | 09:58 AM