Fauzi: చరిత్రలో దాగిన అధ్యాయాల్లో.. అత్యంత ధైర్యవంతుడు
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:07 PM
ప్రభాస్ (Prabhas) హీరోగా హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రారంభం నుంచి పేరు ‘ఫౌజీ’ అని ప్రచారంలో ఉంది.
ప్రభాస్ (Prabhas) హీరోగా హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రారంభం నుంచి పేరు ‘ఫౌజీ’ అని ప్రచారంలో ఉంది. ఇప్పుడు అదే టైటిల్ ను ఖరారు చేశారు. గురువారం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినిమా అప్‌డేట్‌ను పంచుకున్నారు మేకర్స్. మొదటి నుంచి ప్రచారంలో ఉన్న ‘ఫౌజీ’ (Fauzi) టైటిల్ నే ఫైనల్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.
‘పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు..
పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు..
గురువు లేని ఏకలవ్యుడు..
పుట్టకతోనే అతడు ఓ యోధుడు..
మన చరిత్రలో దాగిన అధ్యాయాల్లోని అత్యంత ధైర్యవంతుడైన సైనికుడి కథ ఇది. అతడే ‘ఫౌజీ’ అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.
'ఇప్పటి వరకు సాగిన ఈ ప్రయాణం మరపురాని అనుభూతిని ఇచ్చింది. ఇక్కడి నుంచి ఇది మరింత గొప్పదిగా మారబోతోంది. మన చరిత్రలో దాగి ఉన్న అధ్యాయాల నుంచి ఒక వీరసైనికుడి ధైర్యగాథ ఇది. మీరు ఇంతవరకూ చూడని కథను చూపిస్తున్నాం. ఎప్పుడూ చూడని ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ‘సీతారామం’ తర్వాత దీనిని రాయడానికే సుమారు ఏడాదికి పైగా సమయం పట్టింది. ప్రేక్షకులు తప్పకుండా సర్‌ప్రైజ్ ఫీలవుతారు’ అని దర్శకుడు హను రాఘవపూడి పోస్ట్ చేశారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రభాస్‌కు సరసన సోషల్‌మీడియా స్టార్ ఇమాన్వీ నటిస్తున్నారు.