Peddi Movie: 24 గంటల్లో ‘పెద్ది’ ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!
ABN, Publish Date - May 20 , 2026 | 11:20 AM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పెద్ది’. ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలై ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లో ఈ ట్రైలర్ పెద్ద బీభత్సమే సృష్టించేసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi Movie). ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలై ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో వ్యూస్, లైక్స్ సాధిస్తూ దూసుకెళ్తోంది. ట్రైలర్ విడుదలైన తొలి 24 గంటల్లోనే 100 మిలియన్ మార్క్‌ను దాటి 101 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ ఫీట్‌ను అత్యంత వేగంగా అందుకున్న తెలుగు ట్రైలర్‌గా ‘పెద్ది’ ట్రైలర్ (Peddi Trailer) కొత్త రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం పలు భాషల్లో యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది.
ఈ వేసవికి సరైన సినిమా ఇప్పటి వరకు పడలేదు. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి ‘పెద్ది’పైనే ఉంది. ట్రైలర్ సాధించిన ఈ భారీ రికార్డులు సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేశాయి. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు దీన్ని పండగలా సెలబ్రేట్ చేసుకుంటుంటే, హిందీతో పాటు ఇతర భాషల మీడియా కూడా ఇటీవలి కాలంలో వచ్చిన అత్యంత గ్రిప్పింగ్, పవర్‌ఫుల్ ట్రైలర్‌లలో ఇదొకటిగా ప్రశంసలు కురిపిస్తుండటం విశేషం. లైక్స్ పరంగా కూడా ఈ సినిమా అన్ని భాషలలో కలిపి వన్ మిలియన్‌కు దగ్గరగా ఉండటం చూస్తుంటే.. ప్రేక్షకులు ఎంతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో తెలుస్తోంది.
ఈ ట్రైలర్ రామ్ చరణ్ చేసిన అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తోంది. క్రికెట్ సన్నివేశాల్లో లీన్ లుక్‌లో కనిపించిన చరణ్.. కుస్తీ ఎపిసోడ్స్‌లో మాత్రం పూర్తి స్థాయి ప్రొఫెషనల్ రెజ్లర్‌లా వీరంగం ఆడేశారు. అంతేకాదు రన్నర్‌గా, మరికొన్ని క్రీడల్లో పాల్గొనే వ్యక్తిగా కూడా ఆయన పాత్రను చూపించడం అదిరిపోయింది. దీంతో ఇది కేవలం హీరో ఎలివేషన్ క్యారెక్టర్ కాకుండా ఎమోషన్స్, కాన్ఫ్లిక్ట్‌తో కూడిన బలమైన పాత్రగా నిలిచింది. దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) ‘పెద్ది’ ప్రపంచాన్ని ఎంతో డీటెయిల్‌గా తీర్చిదిద్దారు. ట్రైలర్‌తో ‘పెద్ది’ వరల్డ్ విజువల్‌గా ఎంత అద్భుతంగా వుంటుందో స్పష్టమవుతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి:
యంగ్ టైగర్‌కు పవర్ స్టార్ బర్త్‌డే విషెస్.. ట్వీట్ వైరల్!
యాక్షన్ కింగ్ అర్జున్ ‘బ్లాస్ట్’ చేసేది ఆ రోజే!
నాకు కాబోయే భర్త ఇండస్ట్రీ వ్యక్తి కాకూడదు: అనన్య నాగళ్ల
మేము అమ్మ, నాన్నలమయ్యాం: జబర్దస్త్ నటుడు ఎమోషనల్!