సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్‌లో ఇక తిరుగులేనట్టే!

ABN, Publish Date - Jun 09 , 2026 | 08:58 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో భారీ హైప్‌తో థియేటర్లలోకి వచ్చిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుని కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

Peddi Movie Still

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో భారీ హైప్‌తో థియేటర్లలోకి వచ్చిన ‘పెద్ది’ (Peddi Movie) బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుని కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాపై రిలీజ్ రోజు కొన్ని సందేహాలు వ్యక్తమైనప్పటికీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆ టెన్షన్ పూర్తిగా తొలగిపోయింది. వీకెండ్ ముగిసి వర్కింగ్ డే అయిన సోమవారం కూడా ఈ చిత్రం ఊహించని స్థాయిలో సాలిడ్ వసూళ్లను రాబట్టింది. మండే టెస్ట్‌లో పాసై.. ‘పెద్ది’ సాధించిన కలెక్షన్ల పట్ల చిత్రబృందం పూర్తి సంతృప్తికరంగా ఉందని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులు ఈ ఎమోషనల్ అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాకు బ్రహ్మరథం పడుతున్నారు.


అయితే, తెలుగు రాష్ట్రాల్లో సినిమా దూసుకుపోతున్నప్పటికీ, నార్త్ బెల్ట్, ఓవర్సీస్ మార్కెట్లలో ఆక్యుపెన్సీ కాస్త తగ్గినట్లు మేకర్స్ గమనించారు. దీంతో అక్కడి ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడానికి సరికొత్త బిజినెస్ స్ట్రాటజీని అమలులోకి తెచ్చారు. అందులో భాగంగా నార్త్ ఇండియాలోని పలు ప్రాంతాల్లో ఈ సినిమా టిక్కెట్ ధర కేవలం రూ. 199 అనేలా ఆఫర్ ప్రకటించారు. అంతేకాకుండా, ఓవర్సీస్ మార్కెట్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు వీలుగా థియేట్రికల్ పాస్‌లను కూడా అందుబాటులోకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ వినూత్న వ్యూహాం ఇప్పుడు నార్త్, ఓవర్సీస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుని.. థియేటర్లకు వచ్చేలా చేస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.


నిజానికి ‘పెద్ది’ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ఓవర్సీస్ బెల్ట్‌లో టిక్కెట్ ధరలు చాలా ఎక్కువగా పెట్టారనే చర్చ గట్టిగా నడిచింది. సాధారణ ప్రేక్షకుడికి అంత ధర భారం కావడంతో అక్కడ కలెక్షన్లపై కాస్త ప్రభావం పడింది. అయితే, మేకర్స్ ఆలస్యం చేయకుండా వెంటనే అప్రమత్తమై ఇప్పుడు ఇలా వ్యూహంతో ముందుకు వెళుతుండటం విశేషం. ఈ సరికొత్త నిర్ణయం ప్రస్తుతానికి ‘పెద్ది’ చిత్రానికి మైలేజ్ ఇవ్వడమే కాకుండా.. రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలకు, ఇతర భారతీయ చిత్రాల ఓవర్సీస్ మార్కెట్ వ్యూహాలకు ఒక మంచి గైడ్‌లైన్‌లా హెల్ప్ అవుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

బాలయ్య అన్‌స్టాపబుల్ జోష్

మెగా హీరోస్ రేంజ్ అది.. మూడు వందల కోట్ల క్లబ్‌లో ఆ ముగ్గురు

Peddi: గురువు సుకుమార్‌లా బ్యాలెన్స్ చేయలేకపోయిన బుచ్చి!

Updated Date - Jun 09 , 2026 | 09:03 PM