మెగా హీరోస్ రేంజ్ అది.. మూడు వందల కోట్ల క్లబ్ లో ఆ ముగ్గురు

ABN , Publish Date - Jun 09 , 2026 | 03:44 PM

కొన్నేళ్ళ క్రితం వరకూ వంద కోట్ల క్లబ్ కు తెలుగునాట ఓ స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోస్ మెల్లగా 200 కోట్ల క్లబ్ లోనూ చోటు సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 300 కోట్ల క్లబ్ కు కూడా ఎంతో క్రేజ్ లభించింది. ఈ క్లబ్ లో ముగ్గురు మెగా ఫ్యామిలీ హీరోస్ చోటు దక్కించుకోవడం ఇప్పుడు విశేషంగా మారింది.

Mega Heroes

కొన్నేళ్ళ క్రితం వరకూ వంద కోట్ల క్లబ్ కు తెలుగునాట ఓ స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోస్ మెల్లగా 200 కోట్ల క్లబ్ లోనూ చోటు సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 300 కోట్ల క్లబ్ కు కూడా ఎంతో క్రేజ్ లభించింది. ఈ క్లబ్ లో ముగ్గురు మెగా ఫ్యామిలీ హీరోస్ చోటు దక్కించుకోవడం ఇప్పుడు విశేషంగా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గత సంవత్సరం 'ఓజీ' సినిమాతో 300 కోట్ల క్లబ్ లో చేరారు. ఈ యేడాది ఆరంభంలోనే సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాతో ఏకంగా 400 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) బాబాయ్, తండ్రిలాగే 'పెద్ది'తో 300 కోట్ల క్లబ్ లో చోటు సంపాదించారు. ఈ సినిమా మొదటి వారం పూర్తి కాకముందే 300 కోట్ల క్లబ్ లో చోటు దక్కించుకుంది. టోటల్ రన్ లో కనీసం 500 కోట్లు చూస్తుందని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు. దీనికి ముందు రామ్ చరణ్, తారక్ కలసి నటించిన 'ట్రిపుల్ ఆర్'మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లో నిలచింది... అయితే సోలో హీరోగా రామ్ చరణ్ కు 'పెద్ది'నే మొదటి 300 కోట్ల చిత్రం కావడం గమనార్హం.


మెగా హీరోస్ కథ ఇలా ఉంటే- మెగా కాంపౌండ్ హీరోస్ లో ఒకరైన అల్లు అర్జున్ ఇప్పటికే రెండు చిత్రాలతో 400 పైగా కోట్లు సాధించారు. అందులో 'పుష్ప-2' చిత్రం దాదాపు 1800 కోట్లు పోగేసిందని ట్రేడ్ టాక్. ఈ రికార్డ్ సాధించిన రెండో టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. అలా 'పుష్ప' రెండు చిత్రాలతోనూ భారీ వసూళ్ళు చూసిన అల్లు అర్జున్ 'పెద్ది' సినిమా ఇంకా చూడలేదా అన్న ఆసక్తి అభిమానుల్లో ఉండేది. ఇటీవలే 'పెద్ది' చిత్రాన్ని వీక్షించిన అల్లు అర్జున్ ఆ సినిమాలో రామ్ చరణ్ నటన చూశాక ఎంతో గర్వంగా ఉందని అన్నారు. 'పెద్ది' పాత్ర ఎంతో సహజంగా రూపొందిందని, దానిని రామ్ చరణ్ కూడా అంతే ఈజ్ గా అభినయించారని బన్నీ తెలిపారు. ఆ పాత్ర కోసం చెర్రీ చేసిన శ్రమ, తెరపై ప్రతిబింబించిందనీ బన్నీ కొనియాడారు. రామ్ చరణ్ కు లభిస్తున్న ప్రశంసలకు ఆయన అన్ని విధాల అర్హుడేనని బన్నీ అన్నారు... ఈ సందర్భంగా సినిమా బృందాన్ని కూడా ఆయన అభినందించారు... బన్నీ చెర్రీని అభినందించడంతో ఇప్పుడు 'పెద్ది'కి మరింత క్రేజ్ పెరిగిందని కొందరు అంటున్నారు.


రామ్ చరణ్ 'పెద్ది' సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కారని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు... అంతకు ముందు ఆయన హీరోగా రూపొందిన 'ఆచార్య', 'గేమ్ చేంజర్' చిత్రాలు అంతగా మెప్పించలేక పోయాయి. ఈ నేపథ్యంలోనే అభిమానులు 'పెద్ది'పైనే భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు... వాటిని నిజం చేస్తూ 'పెద్ది' మొదటి ఐదు రోజుల్లోనే 315 కోట్లకు పైగా సాధించి ఫ్యాన్స్ కు ఆనందం పంచింది. గతంలో 'పుష్ప-1' ద్వారా జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ ఉత్తమ నటునిగా నిలిచారు. అదే తీరున ఈ 'పెద్ది'తో రామ్ చరణ్ సైతం నేషనల్ అవార్డ్ అందుకుంటే చూడాలని ఆశిస్తున్నారు మెగా కాంపౌండ్ ఫ్యాన్స్.. మరి ఏమవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

Scam: సన్నీ లియోన్ సహా కష్టాల్లో కన్నడ తారలు!

Jaya bachchan: అంతా అయిపోయాక మాట్లాడి ప్రయోజనం ఏంటి?

Transfer Trimurthulu: వడ్డే నవీన్, రాశీ సింగ్‌తో స్పెషల్ చిట్ చాట్‌

Updated Date - Jun 09 , 2026 | 04:00 PM