సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Peddi Movie: ‘పెద్ది’ కోసం ఎంఎస్ ధోని.. ఇది కదా న్యూస్ అంటే!

ABN, Publish Date - May 09 , 2026 | 08:39 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా.. దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర ప్రమోషన్స్‌లో క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్. ధోని పాల్గొనబోతున్నారని టాక్ నడుస్తోంది.

MS Dhoni for Ram Charan Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా.. దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (Peddi Movie). స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ప్రమోషన్స్ విషయంలో కొంత స్తబ్దత నెలకొందని టాక్ వినిపించింది. అయితే, ఈ లోటును భర్తీ చేస్తూ మేకర్స్ ఇప్పుడు ఒక భారీ ప్లాన్‌తో సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా నార్త్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ బాలీవుడ్ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా రాంచీలో ఒక భారీ ఈవెంట్‌ను నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ వేడుకకు క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్. ధోని (MS Dhoni)ని ముఖ్య అతిథిగా ఆహ్వానించనున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రతిపాదన కనుక ఓకే అయితే, సినిమా క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం ఖాయం. కథలో క్రికెట్ బ్యాక్‌డ్రాప్ కూడా ఉండటంతో ధోని రాక సినిమాకు అతిపెద్ద అడ్వాంటేజ్‌గా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


మరోవైపు, ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైన రెండు సాంగ్స్, ‘పెద్ది ఫస్ట్ షాట్’ వీడియో సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. టెక్నికల్ వేల్యూస్ పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉండబోతోందని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనుండటంతో సినిమాపై ఉన్న హైప్ మరింత పెరిగింది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో ‘పెద్ది’ బాక్సాఫీస్ సునామీ అప్పుడే మొదలైంది. అక్కడ బుకింగ్స్ ప్రారంభించి 30 నిమిషాల్లోనే 50 వేల డాలర్ల గ్రాస్‌ను వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సెన్సేషనల్ స్టార్ట్ చూస్తుంటే, ప్రీమియర్ షోల సమయానికి సినిమా వసూళ్లు అంచనాలకు మించి ఉంటాయని డిస్ట్రిబ్యూటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవర్సీస్‌లో రామ్ చరణ్‌కు ఉన్న క్రేజ్‌కి ఇది అద్దం పడుతోంది.


వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక ఈ సినిమా సుమారు 3 గంటల రన్ టైంతో రానున్నట్లు తెలుస్తోంది. మరి ఫైనల్ కట్‌లో కూడా ఇదే నిడివి ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఎమోషన్స్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Raghava Theater: ఈ థియేటర్‌లో ఫస్ట్, లాస్ట్ సినిమా ఎన్టీఆర్‌దే.. భావోద్వేగంలో ఫ్యాన్స్!

త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది- వేణు స్వామి

Ranabaali: హార్స్ రైడింగ్ గ్లింప్స్.. విజయ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!

Rao Bahadur: ‘పెద్ది’తో పోటీకి మహేష్ బాబు ‘నో’.. రిలీజ్ డేట్ మారింది!

Updated Date - May 09 , 2026 | 08:39 PM