Peddi: ఏపీ, తెలంగాణలోని మేజర్ సిటీస్‌లో డే1 ఈవెనింగ్ షోస్ స్టేటస్ ఇదే!
ABN , Publish Date - Jun 04 , 2026 | 08:05 PM
తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో ‘పెద్ది’ ప్రభంజనం నడుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా టికెట్స్.. ఓ రేంజ్‌లో తెగుతున్నాయి. మొదటి రోజే ఈ సినిమా ‘బుక్ మై షో’ యాప్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది.
తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో ‘పెద్ది’ (Peddi) ప్రభంజనం నడుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) నటించిన ఈ సినిమా టికెట్స్.. ఓ రేంజ్‌లో తెగుతున్నాయి. మొదటి రోజే ఈ సినిమా ‘బుక్ మై షో’ యాప్‌లో సాయంత్రం 5 గంటల సమయానికి 3.5 లక్షల టికెట్స్ సోల్డ్ అవుట్ చేసుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రీమియర్స్‌తోనే ఆల్రెడీ రికార్డ్ సెట్ చేసిన ‘పెద్ది’ సినిమాపై, కావాలని కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అయినా సరే, అస్సలు తగ్గేదే లే అనేలా టికెట్ ముక్క కూడా దొరక్కుండా హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయంటే.. ‘పెద్ది’ ఆట ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, నగరాలలో మొదటి ఈవెనింగ్ షోల ఫాస్ట్ ఫిల్లిండ్, సోల్డ్ అవుట్ స్టేటస్ ఈ విధంగా ఉన్నాయి.
హైదరాబాద్ - 519/627
వైజాగ్ - 140/140
విజయవాడ - 139/139
గుంటూరు - 61/65
కాకినాడ - 42/42
రాజమండ్రి - 42/42
నెల్లూరు - 34/34
విజయనగరం - 27/27
తిరుపతి - 26/28
ఏలూరు - 23/23
కర్నూలు - 22/26
శ్రీకాకుళం - 15/16
కడప - 9/14
అనంతపురం - 14/18
చిత్తూరు - 7/8
భీమవరం - 16/16
వరంగల్ - 14/16
కరీంనగర్ - 11/16
ఖమ్మం - 10/10
హనుమకొండ - 9/10
మదనపల్లె - 10/10
ఒంగోలు - 12/17
తణుకు - 8/10
ఇది రామ్ చరణ్ అడ్డా అనేలా.. అన్ని సెంటర్స్‌లో ‘పెద్ది’తో తాండవమాడేస్తున్నాడు. ఇదంతా చూస్తున్న అభిమానులు.. మొదటిరోజు కలెక్షన్ల విషయంలో మావాడు సునామీ సృష్టించబోతున్నాడంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
మీరు నిజంగానే పోరాడారు.. ‘పెద్ది’పై పవన్ కళ్యాణ్ బ్యానర్ పోస్ట్!
‘డ్రాగన్’లోని ఆ సంచనాల కోసం వెయిటింగ్ -ఎన్టీఆర్
త్రిషకు మెగా కోడలు ఉపాసన స్పెషల్ సర్‌ప్రైజ్