త్రిషకు మెగా కోడలు ఉపాసన స్పెషల్ సర్‌ప్రైజ్
ABN , Publish Date - Jun 03 , 2026 | 11:52 PM
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణి, గ్లోబల్ విమెన్ ఐకాన్ ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. తాజాగా నటి త్రిషకు ఆమె ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణి, గ్లోబల్ విమెన్ ఐకాన్ ఉపాసన కొణిదెల (Upasana Kamineni Konidela) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలతో మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తుంటారు. తాజాగా ఆమె స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్‌కు ఒక సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ పంపించి వార్తల్లో నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల (Surekha Konidela) నేతృత్వంలో హోమ్ మేడ్ ఫుడ్ బ్రాండ్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ‘అత్తమ్మాస్ కిచెన్’ (Athamma's Kitchen) నుంచి ప్రత్యేకమైన ఫుడ్ బాక్స్‌ను త్రిష (Trisha)కు బహుమతిగా పంపించారు ఉపాసన.
ఈ స్పెషల్ గిఫ్ట్ బాక్స్‌లో సాంప్రదాయ పద్ధతిలో తయారుచేసిన నోరూరించే ఆవకాయ పచ్చడితో పాటు కేసరి, పొంగల్, ఉప్మా, రసం లాంటి ఎన్నో రకాల రుచికరమైన ఇన్‌స్టెంట్ బ్రేక్‌ఫాస్ట్, పొడుల ప్యాకెట్లు ఉన్నాయి. ఉపాసన పంపిన ఈ హోమ్ మేడ్ సర్ప్రైజ్‌ను చూసి త్రిష ఎంతో సర్‌ప్రైజ్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ‘థాంక్యూ సో మచ్ ఉపాసన కొణిదెల.. ఈ టేస్టీ వంటకాలు చూస్తుంటే నిజంగా ఇంట్లోకి వేసవి కాలం వచ్చేసినట్లు అనిపిస్తోంది’ అంటూ హార్ట్ ఎమోజీలతో తన ఆనందాన్ని పంచుకున్నారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ లాంటి భారీ సోషియో ఫాంటసీ చిత్రంలో త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ నుంచి త్రిషకు ఈ ప్రత్యేకమైన హోమ్ మేడ్ గిఫ్ట్ అందడం, దానికి ఆమె అంత క్యూట్‌గా రియాక్ట్ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు, ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికలలో విజయ్ గెలవడానికి త్రిష కూడా ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. త్వరలోనే విజయ్, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
‘పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు
NBK 111: ‘నో మోర్ వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్’.. సరికొత్త అవతారంలో బాలయ్య
Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ