Ram Charan - Pawan Kalyan: రామ్ చరణ్ వైరల్ ట్వీట్

ABN , Publish Date - Jan 05 , 2025 | 12:17 PM

తన బాబాయ్‌, ఆంధప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు థాంక్స్‌ చెప్పారు గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌. శనివారం రాజమండ్రిలో జరిగిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌తో దిగిన ఫొటోలను ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు.

Ram Charan - Pawan Kalyan: రామ్ చరణ్ వైరల్ ట్వీట్

తన బాబాయ్‌, ఆంధప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు (AP deputy CM Pawan Kalyan) థాంక్స్‌ చెప్పారు గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌. శనివారం రాజమండ్రిలో జరిగిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌తో దిగిన ఫొటోలను ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘‘డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ గారు.. మీ తనయుడు, నటుడు, భారత పౌరుడిగా నేను మిమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నాను. నా వెన్నంటే ఉన్నందుకు, నాకెప్పుడూ సపోర్ట్‌ చేస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని పోస్ట్‌ పెట్టారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ శనివారం సాయంత్రం రాజమండ్రిలో జరిగింది. పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు. ‘‘రామ్‌చరణ్‌ మా బంగారం. ఒక తల్లికి పుట్టకపోయినా నా తమ్ముడు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు. అద్భుత విజయాలు కలగాలని ఒక బాబాయిగా కాదు, అన్నగా ఆశీర్వదిస్తున్నా. లవ్‌ వ్యూ రామ్‌చరణ్‌.. లవ్‌ వ్యూ ఆల్‌’’ అని పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే టికెట్‌ రేటు పెంచడం గురించి కూడా పవన్‌కల్యాణ్‌ ప్రస్తావించారు.



రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో కియారా అడ్వాణీ కథానాయిక. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా దర్శకుడు శంకర్‌ తెరకెక్కించారు. కార్తిక్‌ సుబ్బరాజు అందించిన కథ ఇది. రామ్‌చరణ్‌ ఇందులో రామ్‌నందన్‌, అప్పన్న అనే రెండు పాత్రల్లో నటించారు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే అప్పన్న పాత్ర సినిమాకు కీలకంగా ఉండనుందని ఇప్పటికే టీమ్‌ ప్రకటించింది. అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. 

Updated Date - Jan 05 , 2025 | 12:18 PM