సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వీక్ డే లోనూ ‘పెద్ది’ బీభత్సం.. 5 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?

ABN, Publish Date - Jun 09 , 2026 | 04:07 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా 5 రోజుల కలెక్షన్స్‌ను మేకర్స్ తెలుపుతూ ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Ram Charan in Peddi

నిజాయితీగా పని చేస్తే సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ‘పెద్ది’ (Peddi Movie) నిరూపించిందని తాజాగా జరిగిన థ్యాంక్యూ మీట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన ఎంత నిజాయితీగా ఈ సినిమా కోసం కష్టపడ్డారో ఈ సినిమా చూసిన వారంతా మైకుల ముందు చెబుతూనే ఉన్నారు. అలాగే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా ఆ మాటని నిజం చేస్తున్నాయి. అవును, ‘పెద్ది’ విడుదలై, మొదటి వీకెండ్ కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఎవరెంతగా నెగిటివ్ ప్రచారం చేసినా.. ‘పెద్ది’ ప్రభంజనాన్ని ఆపలేరని నిరూపిస్తూ వీక్ డే‌లోనూ ‘పెద్ది’ కలెక్షన్స్ నిరూపించాయి.


వీకెండ్ ముగిసి, వీక్ మొదలైన సోమవారం కూడా ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. దీంతో ఈ సినిమా మూడు వందల కోట్ల క్లబ్‌లోకి చేరి.. 5 రోజులలోనే ఈ ఫీట్ సాధించిన చిత్రాల సరసన నిలిచింది. తాజాగా ఈ మూవీ 5 రోజులకు రాబట్టిన కలెక్షన్స్ (Peddi 5 days Collections) వివరాలతో మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ప్రకారం ‘పెద్ది’ సినిమా 5 రోజులకు గానూ రూ. 315 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టి.. బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించేసింది. మంగళవారం కూడా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతుండటంతో.. వీక్ డే‌లో కూడా ‘పెద్ది’గాడు ఆటకి తిరుగులేదంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.


వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ రోజు మిక్స్‌డ్ టాక్ వినిపించింది. కానీ, మరుసటి రోజు నుంచే టాక్ మారింది. రివ్యూలు, రేటింగ్స్‌తో పనిలేకుండా ప్రేక్షకులు తమ మౌత్ టాక్‌తో సినిమాను నిలబెట్టేశారు. థ్యాంక్యూ ఈవెంట్‌లో జగపతిబాబు చెప్పినట్లుగా.. ‘పెద్ది ఆడాడు.. పోరాడాడు.. గెలిచాడు’ అనే చెప్పుకోవాలి. ఇక ఈ ‘పెద్ది’గాడి ప్రభంజనం ఎక్కడ ఆగుతుందనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైందీ చిత్రం. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి:

మెగా హీరోస్ రేంజ్ అది.. మూడు వందల కోట్ల క్లబ్‌లో ఆ ముగ్గురు

Peddi: గురువు సుకుమార్‌లా బ్యాలెన్స్ చేయలేకపోయిన బుచ్చి!

ఆ పనిచేస్తే టీవీకే సర్కారుకు మంచి పేరు -సత్యరాజ్

Updated Date - Jun 09 , 2026 | 04:14 PM