నారా రోహిత్ హీరో.. కొరటాల క్లాప్!
ABN , Publish Date - May 11 , 2026 | 04:34 PM
రోహిత్ నారా హీరోగా మరో ప్రతిష్టాత్మకమైన చిత్రం సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ చిత్రం ఫీల్‌గుడ్ రొమాంటిక్ కామెడీగా, ఆకట్టుకునే కుటుంబ భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరించనుందని టీమ్ చెబుతోంది.
రోహిత్ నారా (Rohith Nara) హీరోగా మరో ప్రతిష్టాత్మకమైన చిత్రం సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. కరణ్ C ప్రొడక్షన్స్ LLP బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.5గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. నారా రోహిత్ 23 (#RN23)వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం ఫీల్‌గుడ్ రొమాంటిక్ కామెడీగా, ఆకట్టుకునే కుటుంబ భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరించనుందని టీమ్ చెబుతోంది. భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ.. చినిమిల్లి మణికుమార్ (Chinimilli Manikumar) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ విశేషాలకు వస్తే.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు.
ముహూర్తపు సన్నివేశానికి కొరటాల శివ క్లాప్ కొట్టి, మేకర్స్‌కు స్క్రిప్ట్‌ను అందజేసి చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. నిర్మాత దిల్ రాజు ఫస్ట్ షాట్‌ను డైరెక్ట్ చేయగా, సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాస్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నయన్ సారిక (Nayan Sarika) ఈ చిత్రంలో రోహిత్ నారాకు జోడీగా నటిస్తోంది. అలాగే నరేష్ VK, రోహిణి, సంపత్, అజయ్, వెన్నెల కిషోర్, సుదర్శన్, బ్రహ్మాజీ, రఘు కారుమంచి వంటి వారంతా ఇతర పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌పై ఉన్న ‘Shouting Soon’ అనే ట్యాగ్‌లైన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన విషయం తెలిసిందే. పోస్టర్‌లో కనిపించిన కలర్‌ఫుల్ టోన్, ఎనర్జిటిక్ వైబ్ ఈ సినిమా పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని తెలియజేస్తోంది. మరిన్ని అప్డేట్స్‌ని త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.
ఇక మూవీ ప్రారంభోత్సవ వేడుకలో హీరో రోహిత్ నారా మాట్లాడుతూ.. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రమిది. టైటిల్, ఫస్ట్ లుక్ అన్నీ వచ్చినప్పుడు అంతా, చాలా ఎక్సైట్ అవుతారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. నరేష్‌తో ఇది నా రెండో సినిమా. భరత్ చౌదరి చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేస్తున్నారు. సినిమాకు కావాల్సిన ప్రతి సపోర్ట్ అందిస్తున్నారు. డైరెక్టర్ మణి ఈ సినిమాతో తనేంటో నిరూపించుకుంటాడు. అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. జూన్ 10 నుంచి ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభిస్తున్నామని, షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు చినిమిల్లి మణికుమార్ చెప్పారు. రోహిత్, ఆయన అభిమానులు గర్వపడేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత భరత్ చౌదరి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
‘అండర్ రేటెడ్’ నటిగా చూస్తున్నారా? పాయల్ రాజ్‌ఫుత్ సమాధానమిదే!
Raghava Theater: ఈ థియేటర్‌లో ఫస్ట్, లాస్ట్ సినిమా ఎన్టీఆర్‌దే.. భావోద్వేగంలో ఫ్యాన్స్!
త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది- వేణు స్వామి
Ranabaali: హార్స్ రైడింగ్ గ్లింప్స్.. విజయ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!