Nara Rohit: పుట్టిన రోజు సందర్భంగా 'సుందర కాండ' రిలీజ్ డేట్
ABN , Publish Date - Jul 25 , 2025 | 05:11 PM
ప్రముఖ నటుడు నారా రోహిత్ తాజా చిత్రం 'సుందరకాండ' విడుదల తేదీని అతని పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించారు. ఆగస్ట్ 27న ఈ సినిమా విడుదల కాబోతోంది.
ప్రముఖ నటుడు నారా రోహిత్ (Nara Rohit) బర్త్ డే జూలై 25. ఈ సందర్భంగా అతని తాజా చిత్రం 'సుందరకాండ' (Sundarakanda) రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఆగస్ట్ 27న ఈ సినిమా వినాయక చవితి కానుకగా విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ వీడియో ద్వారా తెలియచేశారు. ఆగస్ట్ 27 అంటే బుధవారం. లాంగ్ వీకెండ్ ఈ మూవీకి కలిసివస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
ఇప్పటికే వెంకటేశ్ హీరోగా కె. రాఘవేంద్రరావు (K Raghavendra rao) 'సుందర కాండ' మూవీని తెరకెక్కించారు. అలానే 'అల్లరి' నరేశ్ (Allari Naresh) హీరోగా బాపు (Bapu) ఓ 'సుందరకాండ'ను రూపొందించారు. వెంకీ 'సుందరకాండ' సూపర్ హిట్ అయితే నరేశ్ 'సుందర కాండ' భారీ పరాజయాన్ని పొందింది. అయితే 'సుందరకాండ' పేరుతోనే ఇప్పుడు నారా రోహిత్ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకుంది. ఇది నారా రోహిత్ కు 20వ చిత్రం కాగా, ఈ సినిమా ద్వారా వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్ (Sridevi Vijayakumar) తో పాటు వృతి వాఘాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీనికి లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు. సిద్ శ్రీరామ్ పాడిన ఫస్ట్ సింగిల్ బహుసా బహుసా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ప్రదీప్ ఎం వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, రోహన్ చిల్లాలే ఎడిటర్, రాజేష్ పెంటకోట ఆర్ట్ డైరెక్టర్. సందీప్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. దాదాపు నెలలో సినిమా విడుదల కానున్నందున మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేయనున్నారు. ఈ సినిమాలో నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం, విశ్వంత్, రూప లక్ష్మి, సునైనా, రఘు బాబు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
'బాణం' (Banam) సినిమాతో 2009లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్... ఆ తర్వాత 'సోలో' (Solo) హీరోతో చక్కని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలేవీ పెద్దంత ఆడలేదు. 'ప్రతినిధి' (Pratinidhi) సినిమాతో మరోసారి నటుడిగా మంచి మార్కులు వేయించుకున్న నారా రోహిత్ ఇటీవల దానికి సీక్వెల్ గా 'ప్రతినిధి 2' సినిమా చేశారు. ఈ సినిమాలో నటించిన సిరీ లెల్లాతోనే రోహిత్ వివాహ నిశ్చితార్థం జరిగింది. అయితే... నారా రోహిత్ తండ్రి మరణంతో ఈ వివాహం వాయిదా పడింది. అతి త్వరలోనే సిరీ మెడలో రోహిత్ మూడు ముడులు వేయనున్నాడు. ఈ నేపథ్యంలో జనం ముందుకు రాబోతున్న 'సుందరకాండ' అతన్ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.
Also Read: Nandamuri Balakrishn - Krish: మరోమారు క్రేజీ కాంబో...
Also Read: Pawan Kalyan: ఫ్యాన్స్ ను ఇలా రెచ్చగొట్టడం నీకు తగునా పవన్