Nara Rohit: ఇక గ్యాప్ ఇవ్వను.. మంచి కథలతో వస్తా!

ABN , Publish Date - Apr 23 , 2024 | 04:21 PM

నారా రోహిత్ చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా ‘ప్రతినిధి 2’. 2018లో వచ్చిన ‘వీరభోగ వసంత రాయలు’ సినిమా తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. మధ్యలో భారీ శరీరంతో కనిపించడంతో.. ఇక నారా రోహిత్ సినిమాలు మానేశాడనే అప్పట్లో టాక్ వైరలైంది. ఇప్పుడు మళ్లీ ఫిట్‌గా తయారై.. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు నారా రోహిత్.

Nara Rohit: ఇక గ్యాప్ ఇవ్వను.. మంచి కథలతో వస్తా!
Nara Rohit in Prathinidhi 2

నారా రోహిత్ (Nara Rohit) చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2). 2018లో వచ్చిన ‘వీరభోగ వసంత రాయలు’ (Veera Bhoga Vasantha Rayalu) సినిమా తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. మధ్యలో భారీ శరీరంతో కనిపించడంతో.. ఇక నారా రోహిత్ సినిమాలు మానేశాడనే అప్పట్లో టాక్ వైరలైంది. ఇప్పుడు మళ్లీ ఫిట్‌గా తయారై.. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు నారా రోహిత్. ఈ విషయం స్వయంగా ఆయనే తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న ‘ప్రతినిధి 2’ చిత్రం ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నారా రోహిత్ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.. చిత్ర విశేషాలను తెలియజేస్తున్నారు.

*HanuMan: ‘హనుమాన్’ 100 రోజులు.. తెర‌వెనుక అస‌లు హీరో ఆయనేనా?


ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ.. నేను గ్యాప్ తీసుకోవడానికి కారణం ఉంది. అప్పట్లో నా సినిమాలు వరసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. అందులో కొన్ని సినిమాలే నాకే నచ్చలేదు. సరిగ్గా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోలేకపోతున్నానని అనిపించింది. అందుకే ఓ రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి.. మళ్లీ ఫ్రెష్‌గా ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాను. రెండేళ్ల గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇద్దామనుకునే సమయానికి కరోనా మహమ్మారితో సినిమాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. సరిగ్గా షూటింగ్స్ కూడా నడవలేదు. కరోనా కారణంగా నా గ్యాప్ ఇంకా పెరిగింది. (Nara Rohit About Prathinidhi 2)


Nara-Rohit.jpg

అయితే ఈ గ్యాప్‌లో చాలా కథలు విన్నాను. వాటిలో కొన్ని మంచి కథలను ఓకే చేశాను. అందులో ఒకటి ఈ ‘ప్రతినిధి 2’. ఇకపై వరసగా నా నుండి సినిమాలు వస్తాయి. ఇక గ్యాప్ ఇవ్వను.. మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాను. ‘ప్రతినిధి 2’ విషయానికి వస్తే.. ఇది ఏ పొలిటికల్ లీడర్‌కు సపోర్ట్‌గా ఉండదు. వ్యవస్థని ప్రశ్నించడం నుంచి మొదలుపెట్టి దానిని క్లీన్ చేసే విధానం కూడా ఇందులో చూపెట్టడం జరిగింది. ఇది ప్రాపగాండ మూవీ కాదు. ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇది హైలీ లోడెడ్ థ్రిల్లర్.. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించే విధంగా ఈ సినిమా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు. (Nara Rohit Interview)

Read Latest Cinema News

Updated Date - Apr 23 , 2024 | 04:21 PM