నాని ‘ఆయా షేర్’.. నయా రికార్డ్!
ABN, Publish Date - May 27 , 2026 | 10:22 AM
‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్ ఇప్పుడో మైల్‌స్టోన్‌ని చేరుకుంది.
‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్.. ఆ అంచనాలను డబుల్ చేస్తూ వచ్చింది. అందులో ముఖ్యంగా మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుడుతూ వదిలిన తొలి సింగిల్ ‘ఆయా షేర్’ (Aaya Sher Song).. ప్రపంచవ్యాప్తంగా మోత మోగుతూనే ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌లలో కూడా ఈ సాంగ్‌ని ప్లే చేస్తున్నారంటే.. ఏ రేంజ్‌లో ఈ సాంగ్ ఆదరణను రాబట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడీ సాంగ్ ఓ నయా రికార్డ్‌ను క్రియేట్ చేసింది.
తాజాగా ఈ పాట తెలుగు వెర్షన్‌లోనే 150 మిలియన్ వ్యూస్, 1.6 మిలియన్ లైక్స్ సాధించి.. నాని కెరీర్‌లోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన చార్ట్‌బస్టర్‌గా నిలిచిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సాంగ్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియా, కాలేజ్ ఫెస్ట్స్, పబ్లిక్ ఈవెంట్స్, డ్యాన్స్ స్టేజీలను షేక్ చేస్తూ.. ఒక కల్చరల్ ఫెనామెనన్‌గా మారింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సృష్టించిన రఫ్ అండ్ రస్టిక్ ప్రపంచం, నాని పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ పాట రికార్డులను సృష్టిస్తూ దూసుకెళుతోంది. పాటలోని ఎర్తీ విజువల్స్, రగ్గడ్ టోన్, నాని మాస్ డ్యాన్స్ మూవ్స్ పాట ఇంపాక్ట్‌ని మరింత పెంచి, బాగా ఆకర్షించాయి.
రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ తన ట్రేడ్‌మార్క్ ఎనర్జిటిక్ బీట్స్‌తో ఈ సాంగ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లగా, కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జంగిరెడ్డి, అర్జున్ చాందీ తమ డైనమిక్ వోకల్స్‌తో పాటకు మరింత జోష్‌ను జోడించారు. ఈ పాట క్రియేట్ చేస్తున్న రికార్డులతో.. ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించబోతుందని నాని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
System Movie Review: సోనాక్షి సిన్హా, జ్యోతిక 'సిస్టమ్' ఓటీటీ మూవీ రివ్యూ
హరిరామజోగయ్య కుమారుడిపై గేయ రచయిత అనంత శ్రీరామ్ ఫిర్యాదు
10 కోట్ల బడ్జెట్.. 1000 కోట్ల కలెక్షన్స్?.. ఇది కదా సక్సెస్ అంటే?