The Paradise: నాని ప్యారడైజ్‌లో చిరంజీవి క్యామియో.. బాక్సులు బద్దలవ్వాల్సిందే

ABN , Publish Date - Sep 08 , 2025 | 09:42 PM

న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న చిత్రాల్లో ది ప్యారడైజ్ (The Paradise) ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్ ఎల్ వి కసినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు.

Paradise

The Paradise: న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న చిత్రాల్లో ది ప్యారడైజ్ (The Paradise) ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్ ఎల్ వి కసినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమపి అభిమానులు భారీగా అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే నాని - శ్రీకాంత్ ఓదెల కాంబోలో దసరా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ప్యారడైజ్ వస్తుండడంతో.. ఇది అంతకుమించి ఉండబోతుందని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.


ఇప్పటికే ప్యారడైజ్ నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాద్ శివారులో 30 ఎకరాల విస్తీర్ణంలో ఒక స్లమ్ సెట్ ను వేశారట. ఇక ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యామియో ఉందని తెలుస్తోంది. సినిమా మొత్తాన్ని మలుపు తిప్పే పాత్ర కాబట్టి స్టార్ ను తీసుకొనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అయితే ఈ క్యామియోకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.


అందుతున్న సమాచారం ప్రకారం ప్యారడైజ్ లో మెగాస్టార్ చిరంజీవి ఆ క్యామియోలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తరువాత శ్రీకాంత్ ఓదెల.. మెగాస్టార్ తో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. అందుకే ఆ పవర్ ఫుల్ రోల్ కు చిరు అయితే కరెక్ట్ గా సరిపోతాడని భావించి.. ఆయనను అడగడం, ఆయన కూడా ఓకే అనడం జరిగాయని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఒకవేళ ఇదే కనుక నిజమైతే బాక్సులు బద్దలవ్వడం ఖాయమని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి శ్రీకాంత్ ఓదెల.. తన ఇద్దరు హీరోలను ఒకే సినిమాలో ఎలా చూపించబోతున్నాడో చూడాలి.

Allu Kanakaratnamma: అల్లు కనకరత్నమ్మకు మెగా ఫ్యామిలీ నివాళి  

Naga Vamsi: నాగవంశీ కూడా భార్యా బాధితుడేనా..

Updated Date - Sep 08 , 2025 | 10:31 PM