The Paradise: ప్యారడైజ్ లో మోహన్ బాబు.. కన్ఫర్మ్ చేసిన లక్ష్మీ మంచు

ABN , Publish Date - Sep 13 , 2025 | 10:04 PM

న్యాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ది ప్యారడైజ్ (The Paradise) ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ మొత్తం ఎన్నో ఆశలు పెట్టుకుంది.

The Paradise

The Paradise: న్యాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ది ప్యారడైజ్ (The Paradise) ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ మొత్తం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే నాని - శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన దసరా ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్ హిట్ తరువాత మరోసారి ఈ కాంబో కలుస్తుంది అంటే ఆ మాత్రం అంచనాలు ఉండడం సహజమే. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.


ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో గా కలక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నాడని వార్తలు వినిపించిన విషయం విదితమే. ప్యారడైజ్ లో విలన్ పాత్ర చాలా కీలకమని, అది సీనియర్ హీరోతో చేయించాలని శ్రీకాంత్ ఓదెల భావించి మోహన్ బాబు అయితే పర్ఫెక్ట్ గా ఉంటాడని ఆయనకు కథ చెప్పడం, వెంటనే ఆయన కూడా ఓకే చెప్పడం జరిగాయని సమాచారం. అయితే ఇది కేవలం పుకారు కాబట్టి ఎప్పుడెప్పుడు మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారా అని ఎదురుచూస్తున్నారు. అయితే మేకర్స్ కన్నా ముందే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ.. ప్యారడైజ్ లో నాన్నగారు నటిస్తున్నారని చెప్పేసింది.


తాజాగా మంచు లక్ష్మీ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఇందులో మోహన్ బాబు నటన, డిసిప్లేన్ గురించి మాట్లాడుతూ.. 'మా నాన్నగారిని ఏరోజు చూస్తే మనోజ్ కు, నాకు వయస్సు అవుతుందేమో కానీ, ఆయనకు వయస్సు అవ్వడం లేదనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ కు ఫోటోలు తీస్తున్నప్పుడు నాకు చూపించారు. బాడీ మజిల్స్ తిప్పి.. కొత్త లుక్ క్యారెక్టర్ కోసం రెఢీ చేస్తున్నారు. ఈ వయస్సులో ఎవరూ అలా చేయరు. వచ్చిన క్యారెక్టర్ చేసుకొని వెళ్లిపోదాం అనుకుంటారు.


చాలామంది యాక్టర్స్ సెట్ కు వచ్చి రెండు గంటలు పనిచేసి.. నేను ఇంతకంటే పని చేయను అని చెప్పి.. ఎందుకంటే వారికి హిస్టరీ ఉంది, నేను సీనియర్ ఆర్టిస్ట్ ని అని చెప్తారు. కానీ, నాన్నగారు సెట్ కి వస్తే చిన్న బిడ్డలాగా బిహేవ్ చేస్తారు. అది కొత్త డైరెక్టర్ అయినా.. సీనియర్ డైరెక్టర్ అయినా.. సెట్ లో ఆయన చాలా ఇన్స్ఫైర్డ్ గా ఉంటారు' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లక్ష్మీ వలన మోహన్ బాబు ప్యారడైజ్ లో కన్ఫర్మ్ అయ్యాడనే విషయంతో పాటు ఈ సినిమాలో మోహన్ బాబు కొత్త లుక్ వేరే లెవెల్ ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో మోహన్ బాబు లోపల దాగున్న ఒరిజినల్ విలన్ ని బయటకు తెస్తాడేమో చూడాలి.

Aamir Khan: కూలీ చేసి పెద్ద తప్పు చేశాను..

Sai Durga Tej: నన్ను.. నా కుటుంబాన్ని బండబూతులు తిడుతున్నారు

Updated Date - Sep 13 , 2025 | 10:04 PM