The Paradise: అదరగొట్టిన జడల్‌

ABN , Publish Date - Aug 09 , 2025 | 04:04 AM

నాని కథానాయకుడిగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్‌ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

నాని కథానాయకుడిగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్‌’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో నాని ఇంతకు ముందెన్నడూ చేయని క్యారెక్టర్‌ను చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నాని ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. కోరమీసం, గెడ్డం, రెండు జడలతో ఆయన విభిన్నమైన లుక్‌లో కనిపించారు. ఇందులో నాని పాత్ర పేరు ‘జడల్‌’. పోస్టర్‌లో నాని వెనుక కత్తులు- బుల్లెట్లతో తయారైన భారీ చక్రం, పొగ మంచులో ఎగిరే కాకులు ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. కాగా, ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బేనర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. 2026 మార్చి 26న తెలుగు సహా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది.

Updated Date - Aug 09 , 2025 | 04:04 AM