The Paradise: నాని తల్లిగా.. బాలీవుడ్ బ్యూటీ! 'ఎల్లమ్మ' తర్వాత.. మరోసారి తెలుగులో
ABN , Publish Date - Nov 03 , 2025 | 02:23 PM
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న 'ది ప్యారడైజ్' మూవీలో సోనాలీ కులకర్ణి నటిస్తోంది. విశేషం ఏమంటే... ఆమె చాలా కాలం క్రితమే మోహన్ కోడా డైరెక్ట్ చేసిన 'ఎల్లమ్మ' సినిమాలో కీలక పాత్రను పోషించింది.
అవార్డ్ విన్నింగ్ యాక్ట్రస్ గా సోనాలి కులకర్ణి (Sonali Kulakarni) కి జాతీయ స్థాయిలో మంచి పేరుంది. మరాఠీ, హిందీ, గుజరాతీ, తమిళ, ఇంగ్లీష్ చిత్రాలలో నటించిన సోనాలీ కులకర్ణి ఏ పాత్ర చేసినా అందులోకి పరకాయ ప్రవేశం చేస్తుంది. నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తెరకెక్కిస్తున్న 'ది ప్యారడైజ్' (The Paradise) మూవీలో సోనాలి కులకర్ణి కీలక పాత్రను పోషిస్తోంది. నవంబర్ 3 సోనాలి కులకర్ణి పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'ది ప్యారడైజ్' మేకర్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా నుండి వచ్చిన 'రా స్టేట్ మెంట్' గ్లింప్స్ కు సోనాలి కులకర్ణి ఇచ్చిన వాయిస్ నూ ఎవ్వరూ అంత తేలికగా మర్చిపోరు. ఓ పెక్యులర్ మాడ్యుల్ లో సోనాలి కులకర్ణి 'రా' గా చెప్పిన డైలాగ్స్ డైనమేట్ మాదిరి పేలాయి. ఆ గ్లింప్స్ లోని వాయిస్ ను వింటే... నాని తల్లి పాత్రను సోనాలి కులకర్ణి చేస్తోందనే విషయం బోధపడుతుంది. ఇందులో ఆమె పాత్ర కూడా అద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. చాలామంది సోనాలి కులకర్ణి నటిస్తున్న తొలి తెలుగు సినిమా 'ది ప్యారడైజ్' అనుకుంటారు కానీ ఆమె చాలా కాలం క్రితమే తెలుగులో మోహన్ కోడా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'ఎల్లమ్మ' (Ellamma) అనే చిత్రంలో నటించింది. ఆ సినిమాలో నాజర్, రేవతి కీలక పాత్రలు పోషించారు.
ఇక 'ది ప్యారడైజ్' విషయానికి వస్తే... ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో మరో కీలక పాత్రను విలక్షణ నటుడు మోహన్ బాబు చేస్తున్నాడు. అవినాశ్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా వచ్చే యేడాది మార్చి 26న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల కానుంది.
Also Read: RGV: వామ్మో రాంగోపాల్ వర్మా.. ఏందయ్యా ఇది! మళ్లీ ఏం.. ఫ్లాన్ చేశావయ్యా
Also Read: Meenaakshi Chaudhary: ఓ రోజు ఆలస్యంగా మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్...