Mega158: ‘చిరు158’ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్, మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్!
ABN , Publish Date - May 20 , 2026 | 01:56 PM
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘వాల్తేర్ వీరయ్య’. ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో తెలియంది కాదు. ఇప్పుడీ కాంబోలో మరో మాస్ ఎంటర్‌టైనర్ తెరకెక్కబోతోంది.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), బాబీ (Bobby) కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘వాల్తేర్ వీరయ్య’ (Waltair Veerayya). ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో తెలియంది కాదు. ఇప్పుడీ కాంబో మరో మాస్ ఎంటర్‌టైనర్ కోసం జతకడుతున్నారనే వార్త ఫ్యాన్స్‌కు ఎంతో ఆనందాన్నిస్తోంది. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మించనున్నారు. ‘మెగా158’ (Mega158) వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకోనున్న ఈ మూవీ మే 21న అధికారికంగా ప్రారంభం కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో ఈ మూవీకి పని చేస్తున్న సాంకేతిక నిపుణుల వివరాలను కూడా టీమ్ అధికారికంగా తెలియజేస్తోంది.
ఈ సినిమాకు టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ ఈ చిత్రానికి డీవోపీగా వ్యవహరిస్తుండగా, తాజాగా మరో ఇద్దరు టాలెంటెడ్ టెక్నీషియన్స్ పేర్లను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా (Avinash Kolla) ఎంపికయ్యారు. అలాగే సంగీత దర్శకుడిగా మ్యూజిక్ సెన్సేషన్ థమన్. ఎస్ (Thaman S)ను, ఎడిటర్‌గా రూబెన్‌ను ఫైనల్ చేసినట్లుగా మేకర్స్ బుధవారం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవిని ఇప్పటివరకు ఎప్పుడూ చూడని అత్యంత ఫెరోషియస్ అవతార్‌లో ప్రజెంట్ చేయడానికి, భారీ స్థాయి సినిమాటిక్ వరల్డ్‌ను తన విజన్, ఎక్స్‌పర్టైజ్‌తో క్రియేట్ చేయడానికి అవినాష్ కొల్లా రెడీ అవుతున్నారు.
మరోవైపు ‘గాడ్ ఫాదర్’ చిత్ర టైమ్‌లో బాస్‌తో స్టెప్పులేయించే సాంగ్ చేయలేకపోయానని థమన్ ఎంతో ఫీలైన సంగతి తెలిసిందే. ఎందుకంటే, ఆ కథాంశానికి అంత అవసరపడలేదు. అందుకే ఈసారి తన అభిమాన హీరో కోసం, తన టాలెంట్ ఏంటో చూపిస్తానని.. ఆల్రెడీ థమన్ హింట్ ఇచ్చేశారు. థమన్ నుంచి ఈ హింట్ వచ్చిందంటే.. థియేటర్లలో సౌండ్ బాక్సులకు మూడినట్టే అని ఫిక్స్ అయిపోవచ్చు. కాబట్టి, ఈ సినిమా వచ్చే నాటికి థియేటర్స్ యాజమాన్యం అలెర్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే కచ్చితంగా ఉంటుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న బాబీ కొల్లి, ఈసారి చిరంజీవిని ఇప్పటివరకు చూడని అత్యంత పవర్‌ఫుల్ అవతార్‌లో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!
Peddi Movie: 24 గంటల్లో ‘పెద్ది’ ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!
యంగ్ టైగర్‌కు పవర్ స్టార్ బర్త్‌డే విషెస్.. ట్వీట్ వైరల్!
నాకు కాబోయే భర్త ఇండస్ట్రీ వ్యక్తి కాకూడదు: అనన్య నాగళ్ల