Mega158: చిరుతో రాజాసాబ్ బ్యూటీ రొమాన్స్.. మహా దారుణం ఇది
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:49 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.
Mega158: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే విశ్వంభర (Vishwambhara) సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈ రెండు సినిమాలు కాకుండా చిరు నటిస్తున్న మరో చిత్రం మెగా 158. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు వీరి కాంబో రీపీట్ అవుతుంది అనేసరికి మెగా 158పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఇక మెగా 158 ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలుకానుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చిరు సరసన మాళవిక మోహనన్ నటిస్తుందని తెలుస్తోంది. ది రాజా సాబ్ సినిమాతో ఈ చిన్నది టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయని తెలుస్తోంది. అందులో మెగా 158 ఒకటని సమాచారం.
ఈమధ్యనే మాళవిక.. మోహన్ లాల్ తో కలిసి హృదయపూర్వం అనే సినిమా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు తెలుగులో చిరుతో నటించే అవకాశం రావడం నిజంగా లక్కీ ఛాన్స్ అనే చెప్పొచ్చు. అయితే ఇది మాళవికకు మంచి ఛాన్స్ కానీ, చిరుకు మాత్రం ఇది బ్యాడ్ ఛాయిస్ అనే చెప్పాలి. నటన పరంగా అని కాదు కానీ, వయస్సుపరంగా మాళవిక.. చిరు పక్కన సెట్ అవ్వదు అని చెప్పుకొస్తున్నారు. ఎప్పటినుంచో చిరు కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ ట్రోల్స్ కు గురవుతూనే ఉన్నాడు. ఇప్పుడు మాళవికను హీరోయిన్ గా తీసుకుంటే మరోసారి చిరు ట్రోలింగ్ తప్పదు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వార్త విన్నవారు.. మహా దారుణమిది. ఆయన వయసెక్కడ.. ఆమె వయసెక్కడ అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
Kajol: యాక్టర్‌లకు ఆ అవకాశం ఉండదు అన్నానే తప్ప తక్కువ చేయలేదు..
OTT Movies: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు