Chiranjeevi - Bobby: బాస్.. బాబీ.. సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి..
ABN , Publish Date - Jan 22 , 2026 | 03:13 PM
‘వాల్తేరు వీరయ్య’ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. చిరంజీవి, కె.ఎస్.రవీంద్ర (బాబీ) కలయికలో ఇప్పటికే ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఫ్యాన్ బాయ్ బాబీ కథా చర్చలు పూర్తి చేశారు.
‘వాల్తేరు వీరయ్య’ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. చిరంజీవి(Chiranjeevi), కె.ఎస్.రవీంద్ర (bobby - బాబీ) కలయికలో ఇప్పటికే ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఫ్యాన్ బాయ్ బాబీ కథా చర్చలు పూర్తి చేశారు. అయితే ఈ నెలలోనే కొబ్బరికాయ కొట్టి సినిమా ప్రారంభిస్తారని టాక్ వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా ప్రారంభం ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం మార్చిలో సినిమాకు క్లాప్ కొట్టి సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారని తెలిసింది. మరోపక్క నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఇది సింగిల్ హీరో కథ కాదని, మల్టీస్టారర్ అని టాక్ నడుస్తోంది. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఇందులో కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. ఇటీవల బాబీ, మోహన్‌లాల్‌ను కలిసొచ్చారని, దాదాపు ఆయన ఓకే చేశారని తెలిసింది.
ఇందులో కథానాయికగా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టండాన్ పేరు పరిశీలిస్తున్నారు. అలాగే నయనతార, తమన్నా పేర్లు కూడా పరిశీలించారట. రవీనా అయితే ఆ పాత్రకు కొత్తగా ఉంటుందని భావించారట, కృతిశెట్టిని ఓ పాత్రకు ఎంపిక చేశారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతా ఓకే అయితే మార్చిలో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.