MEGA 158: వీరయ్యను మించే మాస్ ఎలిమెంట్స్‌తో..
ABN , Publish Date - Sep 12 , 2025 | 07:13 PM
మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్‌గారు’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్‌గారు’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోపక్క ‘విశ్వంభర’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మరో మూడు చిత్రాలు క్యూలో ఉన్నాయి. అందులో బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా ఒకటి. ‘వాల్తేరు వీరయ్య’తో సూపర్‌హిట్ ఇచ్చిన బాబీ (Ks Ravindra) కొల్లితో చిరు ఓ చిత్రం చేయబోతున్నారు.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించారు. 'మెగా 158’ (mega 158) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం గురించి అప్‌డేట్ వచ్చింది. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ ప్రకటించారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై లోహిత్ ఎన్‌కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ నేపధ్యాన్ని చెప్పారు. 'వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని మించి మాస్ అంశాలతో ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తుంది.