సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ఫౌజీ’లో చేస్తున్నందుకు గర్వంగా ఉంది- జయప్రద

ABN, Publish Date - May 27 , 2026 | 03:59 PM

రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ‘ఫౌజీ’ చిత్రంపై సీనియర్ నటీమణి జయప్రద ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు. ఇందులో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే.

Jayapradha about Fauzi

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ‘ఫౌజీ’ (Fauzi) చిత్రంలో సీనియర్ నటి జయప్రద (Jayapradha) ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ‘ఫౌజీ’ గురించి చెప్పిన వ్యాఖ్యలు అభిమానుల్లో, సినీ ప్రియుల్లో.. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నానని, ప్రభాస్‌తో కలిసి ఇంతటి అద్భుతమైన సినిమాలో నటించడం ఎంతో గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. జయప్రద చెప్పిన ఈ మాటలు సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచడమే కాకుండా, వెండితెరపై ఈ చిత్రం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందోననే ఆసక్తిని అందరిలోనూ రేకెత్తిస్తున్నాయి.


భారతీయ చలనచిత్ర రంగంలో ఉన్న సీనియర్ నటీమణులలో జయప్రద ఒకరు. అలాంటి లెజెండరీ నటి ‘ఫౌజీ’ చిత్రం గురించి, ప్రభాస్ గురించి అంత పాజిటివ్‌గా మాట్లాడటం అభిమానులకు ఎంతో స్పెషల్ మూమెంట్‌గా నిలుస్తోంది. ఈ సినిమాను ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్‌గా అభివర్ణించిన ఆమె, ఇందులో భాగమవడంపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రభాస్ పట్ల, చిత్రయూనిట్ పట్ల ఆమె చూపించిన అభిమానం, ప్రశంసలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలను బట్టి సీనియర్ నటీనటులకు ప్రభాస్ పై ఎంతటి గౌరవం, అభిమానం ఉన్నాయో అర్థమవుతోంది.


మరోవైపు ప్రభాస్‌తో పాటు, ఆయన అభిమానులు మంచి హిట్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన ‘ది రాజా సాబ్’ చిత్రం ఊహించని ఫలితాన్ని చవిచూసింది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశించిన అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రభాస్ మాత్రం ఈ సినిమా రిజల్ట్‌ని పట్టించుకోకుండా.. తన తదుపరి సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇప్పుడాయన చేస్తున్న సినిమాలన్నీ భారీ పాన్ ఇండియా సినిమాలే. అందులో ‘పౌజీ’ చిత్రం ప్రభాస్‌కు, అభిమానులకు కూడా చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. హను రాఘవపూడి వంటి క్లాస్ డైరెక్టర్ నుంచి వస్తోన్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

‘రంగస్థలం’ చిట్టిబాబుకి, ‘పెద్ది’కి ఉన్న తేడా ఏంటంటే?

‘అమ్మ’కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు!

మళ్లీ కత్తిలా తయారైన కాజల్.. ఈ గ్లామర్ ఫొటోలు చూశారా!

System Movie Review: సోనాక్షి సిన్హా, జ్యోతిక 'సిస్టమ్‌' ఓటీటీ మూవీ రివ్యూ

Updated Date - May 27 , 2026 | 04:44 PM