సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తెలుగులో మరో ‘తారే జమీన్ పర్’.. ట్రైలర్ విడుదల

ABN, Publish Date - Oct 31 , 2026 | 04:59 PM

బాలల భావోద్వేగాలు, ప్రస్తుత విద్యా వ్యవస్థ తీరుతెన్నులను ప్రతిబింబిస్తూ కుటుంబ సమేతంగా చూడదగ్గ అద్భుతమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Jayannth and the Jingo Pen

బాలల భావోద్వేగాలు, ప్రస్తుత విద్యా వ్యవస్థ తీరుతెన్నులను ప్రతిబింబిస్తూ కుటుంబ సమేతంగా చూడదగ్గ అద్భుతమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ (Jayannth and the Jingo Pen). నమో జయం ప్రొడక్షన్స్ పతాకంపై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మాణంలో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన (Naveen Deshaboina) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ‘మన శంకర వర ప్రసాద్’ ఫేమ్ ఊహా రెడ్డి ప్రధాన పాత్రల్లో కనిపించనుండగా.. సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. బాలల దినోత్సవం కానుకగా ఈ చిత్రాన్ని నవంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నారు.


ఈ సందర్భంగా శుక్రవారం.. హైదరాబాద్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి (MLC Sripal Reddy) మాట్లాడుతూ.. ఈ సినిమా కథ వినగానే మనసుకు ఎంతగానో హత్తుకుంది. గతంలో నేను కూడా టీచర్‌గా పనిచేశాను. హిందీలో అమీర్ ఖాన్ ‘తారే జమీన్ పర్’ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో.. తెలుగులో ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ అంతటి ఘన విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం నాకుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రమిది. మొదటి రోజే నేను ఒక పూర్తి థియేటర్ హాల్‌ను బుక్ చేసి, మా టీచర్లు, స్టూడెంట్స్ అందరితో కలిసి ఫస్ట్ షో చూస్తానని చెప్పుకొచ్చారు.


పిల్లలు సాధించే మార్కులు, ర్యాంకుల కంటే ముందుగా వారి అంతరంగాన్ని అర్థం చేసుకోవాలనే బలమైన సందేశాన్ని ఈ చిత్రంలో హృద్యంగా ఆవిష్కరించారు. అమ్మా, నాన్న, గురువుల గొప్పదనాన్ని చాటిచెబుతూనే.. ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు, చదువుల భారాన్ని ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. ప్రవీణ్ బొలిశెట్టి స్వయంగా సంగీతం, మాటలు సమకూర్చిన ఈ చిత్రం.. బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు, తల్లిదండ్రులకు ఒక మంచి సినీ అనుభూతిని అందించనుంది. నవంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలోనూ, విద్యా వర్గాల్లోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ఎలాంటి స్పందనను రాబట్టుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ లాంచ్

RC17 హీరోయిన్ SA కాదు, AP కాదు, PM కాదు.. అచ్చ తెలుగమ్మాయ్

రూ.200 కోట్ల దోపిడీ కేసులో ట్విస్ట్.. నోరా ఫతేహీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు

Updated Date - Oct 31 , 2026 | 05:13 PM