‘మెగావర్స్’లో కమల్ హాసన్ - చిరంజీవిల క్రేజీ ప్రామిస్..
ABN , Publish Date - Oct 29 , 2026 | 10:07 PM
నాలుగు దశాబ్దాలకు పైగా తన అద్భుతమైన నటన, తిరుగులేని మేనియాతో వెండితెరను ఏలిన మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు ‘మెగావర్స్’ పేరుతో తొలిసారిగా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.
వైవిధ్యానికి, రికార్డులకు చిరునామా అయిన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కెరీర్‌లో మరో సరికొత్త అధ్యాయం మొదలైంది. నాలుగు దశాబ్దాలకు పైగా తన అద్భుతమైన నటన, తిరుగులేని మేనియాతో వెండితెరను ఏలిన ఆయన, ఇప్పుడు తొలిసారిగా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ‘మెగావర్స్’ (MegaVerse) పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సెలబ్రిటీ టాక్ షోతో హోస్ట్‌గా సరికొత్త అవతారమెత్తారు. ‘మాస్‌కి గ్రామర్, స్టైల్‌కి డెఫినిషన్.. మెగాస్టార్ ఈజ్ హియర్’ అంటూ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ షో షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నట్లుగా ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది.
ఈ షో చిత్రీకరణలో భాగంగా జరిగిన తాజా ఎపిసోడ్ ఇప్పుడు సినీ పరిశ్రమలో పెను సంచలనంగా మారింది. ఈ టాక్ షోకి ఉలగనాయగన్ కమల్ హాసన్ (Ulaganayagan Kamal Haasan) ముఖ్య అతిథిగా హాజరయ్యారని తెలుస్తోంది. దాదాపు 47 ఏళ్ల క్రితం ‘ఇది కథ కాదు’ (1979) చిత్రంలో కలిసి నటించిన ఈ ఇద్దరు భారతీయ లెజెండరీ నటులు మళ్లీ ఇన్నాళ్లకు ఒకే ఫ్రేమ్‌ను పంచుకోవడం అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. అయితే, ఈ ఎపిసోడ్ షూట్ సందర్భంగా అంతకుమించిన ఓ అద్భుతమైన పరిణామం చోటుచేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
టాక్ షో సంభాషణల మధ్యలో కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ (RKFI) బ్యానర్‌లో ఓ సినిమా చేయాలని కోరగా, అందుకు చిరంజీవి సానుకూలంగా స్పందించి హీరోగా నటించేందుకు మాట ఇచ్చారనేలా ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘ధర్మన్’ చిత్రాన్ని నిర్మిస్తున్న కమల్.. ఇప్పుడు చిరంజీవితోనూ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన ఈ చర్చ నిజమేనా? మెగాస్టార్ నిజంగానే కమల్ బ్యానర్‌లో ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అనేది తెలియాలంటే ఈ క్రేజీ ఎపిసోడ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే!
ఇవి కూడా చదవండి:
Ramayana: ‘జతగూడె’.. కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం సాంగ్
‘ఆకాశంలో ఒక తార’.. మనసును తాకేలా ‘రాధే రాధే’ సాంగ్ విడుదల
అడుగెట్టాడు.. రవితేజ ‘తులాభారం’ క్రేజీ అప్‌డేట్