నాగబాబు విడుదల చేసిన ‘మైలురాయి’ టైటిల్ లుక్
ABN , Publish Date - Oct 29 , 2026 | 07:06 PM
హన్సి ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మిస్తోన్న ఫీల్ గుడ్ చిత్రం ‘మైలురాయి’. తాజాగా ఈ మూవీ టైటిల్ లుక్ పోస్టర్ని మెగా బ్రదర్ నాగబాబు విడుదల చేశారు.
హన్సి ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీ హన్సిక పెద్దిరెడ్డి (Sri Hansika Peddireddy) నిర్మిస్తోన్న ఫీల్ గుడ్ చిత్రం ‘మైలురాయి’ (Mailu Rayi). టాలెంటెడ్ డైరెక్టర్ రఘువర్ధన్ కోట్ల (Raghuvardhan Kotla) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు దేవీ ప్రసాద్, లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ లాంచ్ పోస్టర్‌ను సీనియర్ నటుడు, నిర్మాత, ఏపీ శాసనమండలి సభ్యుడు, ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగబాబు (Mega Brother Nagababu) ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ‘మైలురాయి’ టైటిల్ వినగానే ఎంతో ఆసక్తిగా, క్యాచీగా అనిపించింది. నూతన దర్శకుడు, యువ నటీనటులతో నిర్మాత హన్సిక ఒక మంచి కాన్సెప్ట్ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం చాలా సంతోషకరం. సినీ నిర్మాణంలో మహిళలు చూపే నిబద్ధత, క్రమశిక్షణ ఎంతో ప్రత్యేకమైనవి. ఇప్పటికే స్వప్న దత్, ప్రియాంక దత్, నిహారిక, సుప్రియ యార్లగడ్డ వంటి ఎందరో మహిళా నిర్మాతలు టాలీవుడ్లో విజయవంతంగా తమ ముద్ర వేశారు. హన్సిక కూడా వారిలాగే నిలదొక్కుకుని మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ.. యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘మైలురాయి’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. భావోద్వేగాలు నిండిన స్వచ్ఛమైన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని పాటలు, టీజర్‌ను త్వరలోనే గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నాగబాబు విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తుండటంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
కథలు వినడం మానేసిన అనుపమ.. కారణం ఏంటి?
‘వారణాసి’ వాయిదా వార్తలకు విజయేంద్ర ప్రసాద్ చెక్
కమర్షియల్ బాటలో పీపుల్స్ స్టార్.. మూర్తి గారూ మీరు మారిపోయారు సార్