సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

జబర్దస్త్ ఇమాన్యుయేల్ హీరోగా.. సినిమా టైటిల్ ఇదే

ABN, Publish Date - Oct 16 , 2026 | 07:51 PM

కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై దినేష్ కుర్ర నిర్మిస్తోన్న చిత్రంతో జబర్దస్త్ ఇమాన్యుయేల్ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Destiny Movie First Look

కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై దినేష్ కుర్ర నిర్మిస్తోన్న చిత్రం ‘డెస్టినీ’ (Destiny). చెందు ముద్దు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో జబర్దస్త్ ఇమాన్యుయేల్ (Emanuel Jabardast) లీడ్ రోల్ పోషిస్తుండగా.. శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకురాలు నందినీ రెడ్డి (Nandini Reddy) విడుదల చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోస్టర్ బాగుంది. ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్‌తో అందరికీ పరిచయమయ్యాడు. ఇప్పుడాయన హీరోగా వస్తోన్న ఈ సినిమా మంచి విజయం సాధించి, అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానని అన్నారు.


ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే... ‘డెస్టినీ’ టైటిల్‌కి తగ్గట్టుగా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసినట్టుగా కనిపిస్తోంది. పోస్టర్‌లో కనిపించే సంకెళ్లు.. ఇమాన్యుయేల్ కనిపించే తీరు, పక్కనే ఉన్న నడిచివస్తోన్న కానిస్టేబుల్.. ఆ దారి.. ఆ అడవి ఇవన్నీ చూస్తుంటే.. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదో చెప్పబోతోన్నారనే విషయమైతే అర్థమవుతోంది. టైటిల్‌‌ లోగోలోనూ ఈ ఇద్దరే కనిపిస్తున్నారు. అలా ఈ ఇద్దరి ప్రయాణమే సినిమాగా రానుందనేది ఈ పోస్టర్ తెలియజేస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీకి మారుతి రాజా సంగీతం అందిస్తుండగా, పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా వర్క్, డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

‘ఇట్లు నాగార్జున’ అని చాలా ప్రేమలేఖలు రాశా..: కింగ్ నాగార్జున

జాడ లేని ‘ఆదర్శ కుటుంబం’.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుందా?

Saturday TV Movies: అక్టోబర్ 17, శనివారం.. TV ఛాన‌ళ్ల‌లో వచ్చే సినిమాలు

Updated Date - Oct 16 , 2026 | 07:51 PM