జాడ లేని ‘ఆదర్శ కుటుంబం’.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుందా?
ABN , Publish Date - Oct 16 , 2026 | 04:05 PM
త్రివిక్రమ్, వెంకీ.. తొలిసారి డైరెక్టర్-హీరోగా కలిసి పనిచేస్తున్న సినిమానే ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’. ఈ మూవీ విడుదలపై ఇప్పటి వరకు సరైన క్లారిటీని మేకర్స్ ఇవ్వలేకపోతున్నారు.
టాలీవుడ్లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్స్ అనగానే మనకు టక్కున గుర్తుకువచ్చే పేర్లు విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ వంటి అద్భుతమైన క్లాసిక్స్ ఇచ్చి, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఈ కాంబినేషన్.. ఇప్పుడు తొలిసారిగా డైరెక్టర్-హీరోగా కలిసి పనిచేస్తున్న సినిమానే ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (Aadarsha Kutumbam House No: 47). ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుండగా.. నివేదా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు, వాయిదాల పర్వం అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్, ఇతర పనులు అనుకున్న విధంగా పూర్తి కాకపోవడంతో మేకర్స్ సినిమాను వాయిదా వేశారు. ఆ తర్వాత కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అక్టోబర్‌లోనే సినిమా వస్తుందంటూ ఓ చిన్న హింట్ ఇచ్చారు. ఆ లెక్కన చూస్తే ఈ నెల పూర్తి కావడానికి కేవలం పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది. సాధారణంగా వెంకీ, త్రివిక్రమ్ వంటి క్రేజీ కాంబో మూవీ అంటే.. రిలీజ్‌కు కనీసం రెండు వారాల ముందు నుంచే ప్రమోషన్ల హోరు మోగాలి. ట్రైలర్, సాంగ్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేయాలి. కానీ, అసలు ఇక్కడ అలాంటి హడావిడే కనిపించడం లేదు. అటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జెడ్ స్పీడ్‌లో జరుగుతున్నాయా లేదా అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. కొత్త రిలీజ్ డేట్ గురించి దర్శకనిర్మాతల నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోవడంతో ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందనే ప్రచారం సినీ వర్గాల్లో గట్టిగా జరుగుతోంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా? అని దగ్గుబాటి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
మరోవైపు, త్రివిక్రమ్- వెంకటేశ్ ఒక గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ అక్టోబర్ 9న ఈ సినిమా రిలీజై ఉంటే.. దసరా సెలవులు పర్ఫెక్ట్గా కలిసి వచ్చేవి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసేది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టేవారు. త్రివిక్రమ్ బ్రాండ్ వాల్యూకు తోడు దసరా సెంటిమెంట్ ఉండేది. ట్రైలర్ వచ్చి ఉంటే హైప్ తారాస్థాయికి చేరేది. కానీ ఇప్పుడది జరగకపోవడంతో, ఆ అడ్వాంటేజ్‌ను ఇతర సినిమాలు క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. మరోవైపు ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీకి, ‘జనవరి 12 విడుదల’కి మధ్య గ్యాప్ అంతకంతా తగ్గిపోతుండటంతో వెంకీ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి ‘ఆదర్శ కుటుంబం’ ఈ నెలాఖరుకి వస్తుందా? లేదా నవంబర్‌కి షిఫ్ట్ అవుతుందా? అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి:
Saturday TV Movies: అక్టోబర్ 17, శనివారం.. TV ఛానళ్లలో వచ్చే సినిమాలు
రణబాలి రివ్యూ: విజయ్ దేవరకొండ వీరగాథ ఎలా ఉంది?
జైలర్ 2 రివ్యూ.. సీక్వెల్ సెంటిమెంట్‌ను చెరిపేసిన రజనీకాంత్!