Aishwarya Lekshmi: లైఫ్ పార్టనర్ ముందు ఎలా ఉండాలంటే..
ABN , Publish Date - Oct 16 , 2026 | 07:59 AM
తనకు వచ్చే జీవిత భాగస్వామి ముందు కూడా నేను నేనుగా ఉండాలని యువ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి అంటున్నారు.
తనకు వచ్చే జీవిత భాగస్వామి ముందు కూడా నేను నేనుగా ఉండాలని యువ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి అంటున్నారు. ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, లైఫ్ పార్టనర్ తదితర అంశాలపై మనసువిప్పి మాట్లాడారు. ‘ప్రేమ బంధంలో స్నేహం చాలా ముఖ్యం. సినిమాల్లో లోతైన ప్రేమ కథల్లో నటించినప్పటికీ నిజ జీవితంలో మాత్రం సరళమైన, సంతోషకరమైన ప్రేమకథలనే ఇష్టపడతాను. బాధ, విరహంతో కూడిన ప్రేమకథలు చూసి చూసి విసిగిపోయాను. నేటి తరంలో ప్రేమ బంధాలను వర్ణించడానికి ఉపయోగించే పదాలు కూడా గందరగోళంగా ఉన్నాయి. అలాగే, నేటి యువతకు ప్రేమపట్ల దృక్కోణం కూడా మారిపోయింది. ప్రేమించిన వ్యక్తి ముందు స్వేచ్ఛగా, రక్షణగా ఉండాలని కోరుకుంటాను. నా జీవిత భాగస్వామి దగ్గర కూడా స్వేచ్ఛగా ఉంటూ మనసులో ఉన్నది చెప్పగలగాలి. ఒక చిన్నపిల్లలా ఉండాలి. ఎలాంటి దాపరికాలు లేకుండా పారదర్శకంగా నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
బాలీవుడ్కు కృతి శెట్టి.. ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం
MS Subbulakshmi Biopic: మొన్న కమల్.. ఇప్పుడు రజనీ..
Soori7: మైత్రీ మూవీ మేకర్స్లో సూరి కొత్త ప్రాజెక్ట్.. గ్రాండ్గా ప్రారంభం