సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సొంత వదినపై హీరోయిన్ హన్సిక రూ.2 కోట్ల పరువు నష్టం దావా

ABN, Publish Date - Apr 09 , 2026 | 04:45 PM

హన్సిక మోత్వాని.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. తెలుగులో ఎన్నో చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన ఈ భామ, ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. ఇప్పుడీ నటి తన వదిన, టీవీ నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్‌పై రూ. 2 కోట్లకు పరువు నష్టం దావా వేసి వార్తలలో నిలుస్తున్నారు.

Hansika Family Pic

హన్సిక మోత్వాని (Hansika Motwani).. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. తెలుగులో ఎన్నో చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన ఈ భామ, ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. ఇప్పుడీ నటి తన వదిన, టీవీ నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్‌పై రూ. 2 కోట్లకు పరువు నష్టం దావా వేసి వార్తలలో నిలుస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో మంచి మంచి అవకాశాలు పొందిన హన్సికకు, సక్సెస్ మాత్రం అనుకున్నంతగా దక్కలేదు. దీంతో ఆమెకు అవకాశాలు కూడా తగ్గాయి. అయినా సరే, లేడీ ఓరియంటెడ్ పాత్రలు చేస్తూ, నటిగా తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంది. ఇక సినిమాలతో పాటు ఆమె పెళ్లి విషయంలోనూ ఆ మధ్య బాగా వార్తలలో నిలిచారు. ఇప్పుడు సోదరుడి భార్య విషయంలో ఆమె పేరు మరోసారి వైరల్ అవుతోంది.


తన సోదరుడు ప్రశాంత్ మోత్వాని (Prashant Motwani) భార్య అయినటువంటి ముస్కాన్ నాన్సీ జేమ్స్‌ (Muskan Nancy James) ఆ మధ్య హన్సికపై, అలాగే భర్తపై వేధింపులు, గృహ హింస ఆరోపణలు చేస్తూ పోలీసులను సంప్రదించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం కలిగిందని తెలుపుతూ, హన్సిక ముంబై సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ముస్కాన్ నాన్సీ జేమ్స్‌‌పై రూ. 2 కోట్లకు పరువు నష్టం కింద హన్సిక తరపు న్యాయవాది అద్నాన్ షేక్ పిటిషన్ దాఖలు చేయడంతో, ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ పిటిషన్‌లో తన సోదరుడి వివాహ సమయంలోనే ముస్కాన్ రూ. 27 లక్షలు అప్పుగా తీసుకుని, తిరిగి చెల్లించకుండా ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హన్సిక తెలిపారు. అంతేకాదు, తన సోదరురు, అతని భార్య ఉండే ఇంట్లో తను ఉండటం లేదని, వారితో పరిమితంగానే ఉంటానని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తన వదిన ముస్కాన్ వెంటనే తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, భవిష్యత్‌లో ఎప్పుడూ తనపై ఎలాంటి ఆరోపణలు చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని హన్సిక కోర్టును కోరారు. ముస్కాన్‌పై సివిల్ దావాతో పాటు, భారతీయ న్యాయ సంహిత కింద అంధేరిలోని మెజిస్ట్రేట్ కోర్టులో కూడా క్రిమినల్ పరువునష్టం కేసు దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

ఇప్పుడు నెంబర్ వన్ హీరో ఎవరంటే? - రాజశేఖర్

స్క్రీన్స్ తక్కువ.. క్రేజ్ ఎక్కువ! డ్యూన్ మేనియా షురూ.. ఒక్కో టికెట్ 90 వేలు

అఖిల్ బర్త్‌డే స్పెషల్‌గా.. ‘లెనిన్’ న్యూ పోస్టర్ విడుదల

ఆమనికి తెలంగాణ బీజేపీలో పదవి...

Updated Date - Apr 09 , 2026 | 04:45 PM