Hansika : హృదయాన్ని  కదిలిస్తుంది..  ప్రశ్నలను లేవనెత్తుతుంది

ABN , First Publish Date - 2023-11-16T17:46:51+05:30 IST

'దేశ‌ముదురు' సినిమాతో తెలుగు చిత్ర‌సీమ‌లో అరంగేట్రం చేసిన హ‌న్సిక అతి తక్కువ సమయంలోనే అగ్ర‌క‌థానాయిక‌గా గుర్తింపు  సొంతం చేసుకుంది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఆమె క‌థానాయికగా న‌టిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’.

Hansika : హృదయాన్ని  కదిలిస్తుంది..  ప్రశ్నలను లేవనెత్తుతుంది

'దేశ‌ముదురు' సినిమాతో తెలుగు చిత్ర‌సీమ‌లో అరంగేట్రం చేసిన హ‌న్సిక (Hansika) అతి తక్కువ సమయంలోనే అగ్ర‌క‌థానాయిక‌గా గుర్తింపు  సొంతం చేసుకుంది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఆమె క‌థానాయికగా న‌టిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’ (My name Is shruthi). శ్రీ‌నివాస్ ఓంకార్ (Srinivas Omkar) దర్శకత్వంలో వైష్ణ‌వి ఆర్ట్స్ ప‌తాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు. నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సందర్భంగా.. హీరోయిన్ హన్సిక ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పకొచ్చారు. 

స్కిన్ మాఫియా (Skin mafia) ముప్పును స్పృశించే డార్క్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ నేపథ్యంలో సినిమా చేయడం ఇదే తొలిసారి. నా పాత్ర ఇందులో ఓ ట్రాప్‌లో పడుతుంది. శృతి యాడ్ ఏజెన్సీలో పనిచేస్తోంది. ఆమె పాత్ర ఒక పోరాట యోధురాలులాగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువ. దేనికీ వెనకడుగు వేయదు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుంటూ వెళ్తుంది. అలాంటి శృతికి ఓ భయంకరమైన, అధిగమించలేదని సమస్య ఎదురవుతుంది? దాని నుండి శృతి ఎలా బయటపడింది అనేదే ఈ చిత్ర కాన్సెప్ట్. వ్యక్తిగతంగా నాకు ఇలాంటి చిత్రాలంటే ఇష్టం. 


మా అమ్మ డెర్మటాలజిస్ట్. ఈ సినిమా చేసే క్రమంలో నిజంగా స్కిన్ మాఫియా ఉందా? అని అమ్మను అడిగాను. తను కూడా ఎక్కడో ఇలాంటి ఘటన జరిగినట్లు చదివానని చెప్పింది. ఈ మాఫియా ద్వారా సామాన్యుడి జీవితంలో చీకటి వ్యాపిస్తుంది. ఈ సినిమా కోసం దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ పరిశోధన చేస్తున్న సమయంలో కొన్ని అనుకోని సంఘటనలను ఫేస్ చేశారు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని టచ్ చేస్తూ.. సినిమా చేయడం సవాలుతో కూడుకున్న అంశం. ఊహించని ట్విస్ట్‌లతో.. చూస్తున్న ప్రతి ఒక్కరికీ థ్రిల్ ఇస్తుందీ సినిమా. ఇలాంటి థ్రిల్లర్ స్పేస్‌లో భాగమైనందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్ అవుట్‌పుట్‌తో చూసి చాలా హ్యాపీ. సాంకేతికంగానూ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. మార్క్ కె రాబిన్‌ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా ఉంటుంది. ఈ ఫ్యామిలీ, ఫ్రెండ్లీ థ్రిల్లర్ ప్రతి కుటుంబాన్ని కదిలిస్తుంది. కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది. 

01 (4).jpeg

నేను ఇండస్ట్రీ కి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది.  ఇప్పటికి 50 చిత్రాల్లో నటించ, ఇంకా భిన్నమైన పత్రాలు చేయాలనుంది. ప్రతి పాత్రను డ్రీం రోల్ గానే  భావిస్తా. ప్రస్తుతం తమిళ చిత్రాలతో చాలా బిజీగా ఉన్నాను.. అందుకే నా తెలుగు ఫిల్మోగ్రఫీలో కొంత గ్యాప్ వచ్చింది. నా కెరీర్‌ విషయంలో ఎప్పుడూ బాధపడలేదు. అవకాశాలు ఉన్నా, లేకున్నా.. నేనిప్పుడూ ఇలానే ఉన్నాను. నటన పరంగా మాత్రం నేనింకా సంతృప్తి చెందలేదనే చెబుతాను.. ఇంకా ఎన్నో గొప్ప పాత్రలు చేయాలని ఉంది. నా కెరీర్‌ ప్రారంభంలో అల్లు అర్జున్‌, ప్రభాస్‌తో కలిసి పనిచేసినందుకు నేను గర్వపడుతున్నాను. వారి సినిమాలిప్పుడు సరిహద్దులను చెరిపిస్తూ.. పాన్ ఇండియా రేంజ్‌కి చేరుకున్నాయి. వారి కష్టానికి ఆ గుర్తింపు అర్హమైనదని నేను భావిస్తాను. ఎంత పెద్ద స్టార్స్ అయినప్పటికీ.. ఎప్పటిలాగే వినయంగా ఉండటం వారి గొప్పతనానికి నిదర్శనం. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ థియేటర్‌లో చూసి.. మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చడమే కాదు.. ఆలోచింపజేస్తుందని మాత్రం కాన్ఫిడెంట్‌గా చెప్పగలను..’’ అని తెలిపారు.

Updated Date - 2023-11-16T18:31:39+05:30 IST