Hansika Motwani: మరో హర్రర్ సినిమాతో హన్సిక సిద్ధం..

ABN , Publish Date - Mar 07 , 2024 | 09:42 AM

ప్రముఖ నటి హన్సిక మొత్వాని ప్రధాన పాత్రలో నటించిన ‘గార్డియన్‌’ చిత్రం ఈ నెల 8వ తేదీ ప్రేక్షకుల ముందుకురానుంది. హన్సికతో పాటు సురేష్‌ మేనన్‌, శ్రీమన్‌, అభిషేక్‌, వినోద్‌, శ్రీరామ్‌ పార్థసారథి, మొట్టై రాజేంద్రన్‌, ప్రదీప్‌ రాయన్‌, తంగదురై తదితరులు నటించారు. గురు శరవణన్‌ - శబరి ద్వయం దర్శకత్వం వహించారు. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం సమకూర్చారు. ఫిల్మ్‌ వర్క్స్‌ బ్యానరుపై దర్శకుడు విజయ్‌ చందర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Hansika Motwani: మరో హర్రర్ సినిమాతో హన్సిక సిద్ధం..
Hansika Motwani

ప్రముఖ నటి హన్సిక మొత్వాని (Hansika Motwani) ప్రధాన పాత్రలో నటించిన ‘గార్డియన్‌’ (Guardian) చిత్రం ఈ నెల 8వ తేదీ ప్రేక్షకుల ముందుకురానుంది. హన్సికతో పాటు సురేష్‌ మేనన్‌, శ్రీమన్‌, అభిషేక్‌, వినోద్‌, శ్రీరామ్‌ పార్థసారథి, మొట్టై రాజేంద్రన్‌, ప్రదీప్‌ రాయన్‌, తంగదురై తదితరులు నటించారు. గురు శరవణన్‌ - శబరి ద్వయం దర్శకత్వం వహించారు. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం సమకూర్చారు. ఫిల్మ్‌ వర్క్స్‌ బ్యానరుపై దర్శకుడు విజయ్‌ చందర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. గత యేడాది అక్టోబరులో విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెల్సిందే. ఇపుడు చిత్రం విడుదలను పురస్కరించుకుని, తాజాగా చెన్నై నగరంలో చిత్ర బృందం మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసింది. (Guardian Ready to Release)


Guardian.jpg

ఇందులో హన్సిక మాట్లాడుతూ.. ఇది ఒక లేడీ ఓరియంటెడ్‌ మూవీ. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంలో నటించినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. సంగీత దర్శకుడు శ్యామ్‌ సీఎస్‌ మాట్లాడుతూ.. హన్సికతో వరుసగా మూడు చిత్రాలు చేసే అవకాశం రావడం, ఈ మూడు కూడా హర్రర్‌ మూవీలే కావడం గమనార్హం అన్నారు. దర్శకద్వయం గురు శరవణన్‌ - శబరి మాట్లాడుతూ.. మేమిద్దరం ఇలాంటి వేదిక ఎక్కడానికి ప్రధాన కారణం మా గురువు ప్రముఖ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌. ఆయన మాకు గాడ్‌ఫాదర్‌. దర్శకులుగా ఆయనే మాకు తొలి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎన్ని చిత్రాలకు దర్శకత్వం వహించినప్పటికీ.. ఆయన ఇచ్చిన తొలి అవకాశాన్ని ఎన్నటికీ మరిచిపోలేం. అదేవిధంగా ఈ చిత్ర నిర్మాత విజయ్‌ చందర్‌ దర్శకుడు కూడా కావడంతో ఆయన పలు సూచనలిచ్చారని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Allu Arjun and Sneha Reddy: 13వ పెళ్లి రోజు.. ఐకాన్ స్టార్ ఎమోషనల్ పోస్ట్

****************************

*Devara: తంగం.. జాన్వీ కపూర్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ వైరల్

**************************

*Aa Okkati Adakku: థమన్ వదిలిన ‘ఓహ్ మేడమ్’ సాంగ్

***********************

Updated Date - Mar 07 , 2024 | 12:55 PM