Hansika's Love Shaadi Drama: పెళ్లి వీడియో టీజర్ విడుదల.. ఎమోషనలైన హన్సిక

ABN , First Publish Date - 2023-01-31T14:58:05+05:30 IST

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న నటి హన్సిక మోత్వానీ (Hansika). అల్లు అర్జున్ ‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమై టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.

Hansika's Love Shaadi Drama: పెళ్లి వీడియో టీజర్ విడుదల.. ఎమోషనలైన హన్సిక
Hansika Motwani

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న నటి హన్సిక మోత్వానీ (Hansika). అల్లు అర్జున్ ‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమై టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అనంతరం కోలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా సక్సెస్ సాధించింది. తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న తరుణంలోనే హన్సిక వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

hansika2.jpg

వ్యాపారవేత్త సోహైల్‌ కతూరియాతో హన్సిక పెళ్లి ఇటీవలే ఘనంగా జరిగింది. జైపూర్‌లోని ముండోతా కోటలో జరిగిన ఈ వేడుకకి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే.. హన్సిక పెళ్లి వేడుకకి సంబంధించిన వీడియో త్వరలో ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన టీజర్‌ని తాజాగా డిస్నీ విడుదల చేసింది. ఆ వీడియోలో తన ప్రేమ గురించి, పెళ్లి గురించి మాట్లాడుతూ ఈ తార ఎమోషనల్ అయ్యింది. పెళ్లైన వ్యక్తితో ప్రేమ వివాహానికి కుటుంబాన్ని ఒప్పించడం కొంచెం కష్టమైనట్లు ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

Updated Date - 2023-01-31T14:58:06+05:30 IST