సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ఫౌజీ’ గ్లింప్స్‌పై నేతాజీ మనవడి ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

ABN, Publish Date - Oct 26 , 2026 | 02:11 PM

పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘ఫౌజీ’. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ వివాదంలో చిక్కుకుంది.

Fauzi Glimpse Controversy

పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా, ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘ఫౌజీ’ (Fauzi). మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే, ఈ గ్లింప్స్‌లోని ఒక సన్నివేశం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీసింది. సినిమాలో చూపించిన దృశ్యం భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subash Chandra Bose) ఔన్నత్యాన్ని కించపరిచేలా ఉందంటూ ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


ఈ గ్లింప్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అడాల్ఫ్ హిట్లర్‌కు ప్రభాస్ పాత్రను పరిచయం చేస్తున్నట్లు చూపించారు. దీనిపై నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో వేదికగా ఆయన మాట్లాడుతూ.. దర్శకుడు కేవలం సెన్సేషన్ కోసమే ఈ వివాదాస్పద సన్నివేశాన్ని సృష్టించారని మండిపడ్డారు. ఒక కల్పిత సినిమా పాత్ర కోసం నేతాజీ లాంటి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని హిట్లర్ ముందు కేవలం ఒక ‘సైడ్‌కిక్’లా, సాధారణ పరిచయం చేసే వ్యక్తిగా చూపించడం ఆయన వారసత్వానికే తీరని అవమానమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం మద్దతు కూడగట్టే క్రమంలో హిట్లర్‌తో నేతాజీ సమాన హోదాలో, ఒక రాజకీయ నాయకుడిగా చర్చలు జరిపారని.. అలాంటి చారిత్రక ఘట్టాన్ని సరైన గౌరవంతో, వాస్తవికతతో చూపించాల్సిన బాధ్యత చిత్ర బృందానికి ఉందని గుర్తుచేశారు. ఈ వ్యవహారంలో చిత్ర దర్శకుడు దేశ ప్రజలందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, వెంటనే ఆ సన్నివేశాలను మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.


నేతాజీ కుటుంబంతో పాటు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ కూడా ఈ సన్నివేశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. భారత స్వతంత్ర సంగ్రామంలో హిమాలయమంత ఎదిగిన నేతాజీని సినిమాల్లో ఇలా కమర్షియల్ హంగుల కోసం తగ్గించి చూపించడం సరికాదని పలువురు చరిత్రకారులు, నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద వంటి దిగ్గజాలు కీలక పాత్రలు పోషిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం దుమారం రేపుతున్న ఈ వివాదంపై దర్శకుడు హను రాఘవపూడి గానీ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు గానీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

సౌందర్య అంత అందంగా ఉండేది కాబట్టే.. దేవుడు తీసుకెళ్లిపోయాడు: ఆమని

రజనీతో రజనీకే పోటీ.. టాప్‌-3లో ఒకడే కింగ్‌

సూర్యకు ఈ ఏడాది త్రిపుల్‌ ధమాకా.. అదే జరిగితే హిస్టరీనే

Updated Date - Oct 26 , 2026 | 02:11 PM