సూర్యకు ఈ ఏడాది త్రిపుల్‌ ధమాకా.. అదే జరిగితే హిస్టరీనే

ABN , Publish Date - Oct 26 , 2026 | 10:15 AM

ఒక నటుడి ప్రతిభను ఫలితాలు ఎప్పుడూ నిర్ణయించలేవు. కానీ అదే నటుడికి సరైన కథ తోడై బాక్సాఫీస్ వద్ద విజయం దక్కితే.. ఆ ప్రకంపనలు ఏ స్థాయిలో ఉంటాయో.. అనేదానికి కోలీవుడ్ స్టార్ సూర్యనే ఉదాహరణ.

Scene Movie Update

ఒక నటుడి ప్రతిభను ఫలితాలు ఎప్పుడూ నిర్ణయించలేవు. కానీ అదే నటుడికి సరైన కథ తోడై బాక్సాఫీస్ వద్ద విజయం దక్కితే.. ఆ ప్రకంపనలు ఏ స్థాయిలో ఉంటాయో ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya)కు తమిళంతో పాటు తెలుగునాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తన ప్రతి సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా ఓ సొంత చిత్రంగానే ఆదరిస్తుంటారు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక సూర్యతో పాటు అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. వరుస వైఫల్యాలు ఎదురైనా ఆయన నటనపై నమ్మకం ఏమాత్రం తగ్గలేదు. ఆ నిరీక్షణకు తెరదించుతూ, ఈ ఏడాది సూర్య బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అసాధారణమైనదనే చెప్పుకోవాలి.


సరైన కంబ్యాక్ కోసం చూస్తున్న తరుణంలో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘కరుప్పు’ (Karuppu) చిత్రంతో సూర్య ఖాతాలో అదిరిపోయే సక్సెస్ పడింది. సూర్య నుంచి ఒక పక్కా రా అండ్ రస్టిక్ మాస్ మూవీ వస్తే ప్రేక్షకులు ఎలా బ్రహ్మరథం పడతారో ఈ చిత్రం స్పష్టంగా నిరూపించింది. థియేటర్లలో ఈలలు, గోలలతో పండుగ వాతావరణం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా, సూర్యలోని సరికొత్త మాస్ యాంగిల్‌ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన సినిమాగా కరుప్పు నిలిచింది. ఇక మాస్ సినిమాతో 300 కోట్ల మార్కును అందుకున్న వెంటనే, ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా మరో విభిన్నమైన జోనర్‌తో ఎంట్రీ ఇచ్చారు సూర్య. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons)తో ప్రేక్షకులను పలకరించారు. ఒకవైపు ఊరమాస్ బొమ్మతో థియేటర్లను షేక్ చేసిన హీరో, వెంటనే పూర్తిస్థాయి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రావడం నిజంగా పెద్ద సాహసమే. కానీ సూర్య నటనలోని వైవిధ్యం ప్రేక్షకులను కట్టిపడేసింది. కుటుంబ ప్రేక్షకులు బారులు తీరడంతో ఈ చిత్రం సునాయాసంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. క్లాస్ అయినా మాస్ అయినా కథలో బలం ఉంటే సూర్య స్థాయి ఏంటో ఈ రెండు చిత్రాలు వరుసగా చాటిచెప్పాయి.


ఇప్పుడు అందరి కళ్లూ సూర్య తర్వాతి చిత్రంపైనే పడ్డాయి. మలయాళంలో వినూత్నమైన కథనాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో ‘సీన్’ (Scene) అనే మూవీ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. అటు ఆద్యంతం నవ్వించే వినోదం, ఇటు ఉత్కంఠ రేపే సస్పెన్స్ మిళితం చేసి సరికొత్త నేరేషన్‌తో కథలను నడపడంలో జీతూ మాధవన్ సిద్ధహస్తుడు. ఇప్పుడు సూర్యతో ఆయన చేస్తున్న ‘సీన్’ కూడా అదే తరహాలో అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్లు సోషల్ మీడియాలో భారీ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఒకవైపు మాస్ యాక్షన్, మరోవైపు ఫ్యామిలీ డ్రామా.. ఇప్పుడు క్రైమ్ కామెడీ సస్పెన్స్. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో మూడు పూర్తి భిన్నమైన జానర్లలో చిత్రాలు చేసి, మూడూ బ్లాక్‌బస్టర్లుగా నిలిపితే బాక్సాఫీస్ వద్ద అది సరికొత్త చరిత్రే అవుతుంది. ‘సీన్’ చిత్రంతో సూర్య ఆ అరుదైన హ్యాట్రిక్ సాధిస్తారా లేదా అన్నది తెలియాలంటే దీపావళి వరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి:

అలరిస్తున్న ‘తోట తరణి - ఒక పునరావలోకనం’ ప్రదర్శన

ఐదేళ్ల తర్వాత మళ్లీ.. రజనీకాంత్ ‘ధర్మన్’లో లేడీ సూపర్‌స్టార్

రజనీకాంత్ - కమల్ హాసన్ మల్టీస్టారర్‌కు బ్రేక్.. కారణమిదేనా?

Updated Date - Oct 26 , 2026 | 10:15 AM

Scene Movie: సూర్య, నజ్రియా.. ‘అమ్మో ఇది ఎవర్రా’

Scene: ఈ యేడాది ముచ్చటగా సూర్య మూడో సినిమా!

Suriya - Jyothika: మీ భర్తను నాకు ఇస్తారా?

Suriya 42: భారీ బడ్జెట్‌కు రాజమౌళే కారణం

Suriya - Agaram: 15 ఏళ్ల ప్రయాణం.. 51 మంది డాక్టర్లు.. 1800 మంది ఇంజనీర్లు..