సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అల్లు అర్జున్‌కు ‘జాయ్ ఆఫ్ లైఫ్’ ఎవరో తెలుసా?

ABN, Publish Date - Nov 21 , 2026 | 06:24 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు పాన్-ఇండియా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, మరోవైపు తన కుటుంబానికి అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు.

Allu Arjun and Allu Arha

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు పాన్-ఇండియా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, మరోవైపు తన కుటుంబానికి అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో గడిపే మధుర క్షణాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అల్లు వారి పరివారం అంతా శ్రీలంకలో సందడి చేస్తోంది. అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ 10వ పుట్టినరోజు (Happy Birthday Allu Arha) సందర్భంగా, కుటుంబ సభ్యులంతా కలిసి శ్రీలంకలో ఆమె బర్త్‌డే వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు.


ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ తన కుమార్తె అర్హకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే స్వచ్ఛమైన అనుబంధాన్ని ప్రతిబింబించే ఒక అందమైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పంచుకుంటూ.. ‘హ్యాపీ బర్త్‌డే టు జాయ్ ఆఫ్ మై లైఫ్’ (నా జీవితపు సంతోషానికి జన్మదిన శుభాకాంక్షలు) అంటూ అర్హపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ప్రస్తుతం ఈ క్యూట్ ఫోటో, బన్నీ పెట్టిన క్యాప్షన్ నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులు, సినీ ప్రముఖులు సైతం అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


ఇక అల్లు అర్హ విషయానికి వస్తే.. చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘శాకుంతలం’ చిత్రంలో భరతుడి పాత్రలో నటించి, బాలనటిగా వెండితెరపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా, కేవలం ఐదేళ్ల వయసులోనే ‘ప్రపంచంలోనే అతి చిన్న చెస్ శిక్షకురాలు’గా ‘నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించి అరుదైన రికార్డు సృష్టించింది. అర్హ మాట్లాడే ముద్దుముద్దు తెలుగు మాటలు, అనర్గళంగా చెప్పే పద్యాలకు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. మంచు లక్ష్మి వంటి వారు కూడా అర్హ‌కు ఫ్యాన్స్ అంటే.. ఆమె మాటలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’ వస్తున్నాడు..

‘ఆకాశంలో ఒక తార’ డైరెక్టర్‌, హీరోయిన్‌కు అల్లు అరవింద్ బంపరాఫర్

తారక్, అనిల్ రావిపూడి కాంబో ఫిల్మ్ టైటిల్ ఇదేనా?

Updated Date - Nov 21 , 2026 | 06:24 PM