‘ఆకాశంలో ఒక తార’ డైరెక్టర్‌, హీరోయిన్‌కు అల్లు అరవింద్ బంపరాఫర్

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:34 PM

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫీల్ గుడ్ ఫిల్మ్ ‘ఆకాశంలో ఒక తార’. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ స్పందనతో సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది.

Aakasamlo Oka Tara Success Meet

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా, పవన్ సాధినేని (Pavan Sadineni) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫీల్ గుడ్ ఫిల్మ్ ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara). గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించిన ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటించగా.. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా.. ప్రీమియర్ షోల నుంచే అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలతో బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న సందర్భంగా చిత్ర బృందం తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేదికపై నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) చిత్ర దర్శకుడు పవన్ సాధినేనితో పాటు హీరోయిన్ సాత్విక వీరవల్లికి అదిరిపోయే బంపరాఫర్లు ప్రకటించి సర్‌ప్రైజ్ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ప్రీమియర్ షోలు ముగిసిన రాత్రి 10 గంటల నుంచే తన ఫోన్ మోగుతూనే ఉందని, పత్రికాధిపతులు సైతం ఫోన్ చేసి ఎమోషనల్‌గా మాట్లాడటం తన ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఒక కొత్త అనుభూతిని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ‘‘మేము నిజాయితీగా ఒక మంచి సినిమా తీశాం. కానీ దానికి 10 రెట్లు అధికంగా ప్రేక్షకులు, మీడియా నుంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో హీరో, విలన్ అంటూ ఎవరూ లేరు.. అన్నీ సహజమైన పాత్రలే. మా దర్శకుడు పవన్ సాధినేని ఈ సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్ది నన్ను ఆశ్చర్యపరిచాడు. అందుకే తన తదుపరి సినిమా నాతోనే (గీతా ఆర్ట్స్‌లో) చేయబోతున్నాడు. అలాగే హీరోయిన్ సాత్విక ఈ చిత్రంతో పెద్ద స్టార్ అయిపోయింది. తను మా బ్యానర్‌లో మరో రెండు సినిమాలు చేయనుంది. నాగచైతన్యతో మేము చేయబోయే తదుపరి సినిమాలో కూడా సాత్వికనే హీరోయిన్’’ అని అల్లు అరవింద్ అధికారికంగా ప్రకటించారు. ఇక తన 30 ఏళ్ల మిత్రుడు గున్నం గంగరాజు అద్భుతమైన స్క్రీన్‌ప్లే అందించారని, అశ్వినీదత్‌తో కలిసి గతంలో ఏడు సినిమాలు చేశానని, ఇప్పుడు ఆయన కుమార్తె స్వప్న కూడా తండ్రి అంత వేగంతో పనిచేస్తోందని అరవింద్ కొనియాడారు. దుల్కర్ సల్మాన్ తన పాత్రలో జీవించాడని, సెకండ్ హాఫ్‌ను శ్రుతి హాసన్ తన భుజాలపై మోసిందని ప్రశంసించారు.


నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. అల్లు అరవింద్ లాంటి గొప్ప మిత్రుడిని, నిర్మాతను తన జీవితంలో చూడలేదని, ఆయనతో కలిసి ఈ సినిమా నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందని, సినిమాకు ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు పవన్ సాధినేని మాట్లాడుతూ.. ప్రీమియర్ షోల నుంచే తన ఫోన్ ఆగకుండా మోగుతుండటమే ఈ సినిమా విజయానికి నిదర్శనమని అన్నారు. మొదటి నుంచి తనకు వెన్నెముకలా నిలిచిన అల్లు అరవింద్, అశ్వినీదత్, సందీప్, రమ్య, స్వప్న, విద్యలకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నప్పటి నుంచి అభిమానించే గున్నం గంగరాజు సార్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాయడం తన అదృష్టమని, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఈ సినిమాకు ‘సెకండ్ హీరో’లా నిలిచిందని పేర్కొన్నారు. దుల్కర్ సల్మాన్, సాత్విక, శ్రుతి హాసన్ సహా టీమ్ అందరి కృషి వల్లే ఈ ఘనవిజయం సాధ్యమైందని పవన్ ఆనందం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

తారక్, అనిల్ రావిపూడి కాంబో ఫిల్మ్ టైటిల్ ఇదేనా?

‘రాకా’ విషయంలో బన్నీ ఫ్యాన్స్ ఆందోళన.. కారణమిదేనా?

గిల్‌ కాదు.. సారా టెండూల్కర్ పెళ్లాడేది ఆ హీరోనా?

Updated Date - Nov 21 , 2026 | 05:34 PM

Aakasam Lo Oka Tara: ఆకాశంలో ఒక‌ తార.. హీరోయిన్ ఫ‌స్ట్ లుక్ అదిరింది

AakasamLo Oka Tara: దుల్క‌ర్ స‌ల్మాన్ మ‌రో తెలుగు సినిమా.. ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara: చిట్టి చిట్టి చీమ.. ఎంత వినసొంపుగా ఉందమ్మా

Aakasam Lo Oka Tara: దుల్క‌ర్ 'ఆకాశంలో ఒక తార‌'.. కొత్త‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Aakasamlo Oka Tara: జీవీ ప్ర‌కాశ్‌.. మొత్తానికి తెలుగు వాళ్లను మెప్పించావ్ పో