Allu Arha: ‘రుద్రమదేవి’కి అల్లు అర్జున్.. ‘శాకుంతలం’కి అల్లు అర్హ

ABN , First Publish Date - 2023-04-14T19:08:12+05:30 IST

‘గోన గన్నారెడ్డి’గా ఆయన నటన, పలికిన వాచకం.. హైలెట్‌గా నిలిచి.. ఆ సినిమాకి ఎంతో ఉపయోగపడింది. ఇప్పుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమాకు అల్లు అర్జున్ కుమార్తె..

Allu Arha: ‘రుద్రమదేవి’కి అల్లు అర్జున్.. ‘శాకుంతలం’కి అల్లు అర్హ
Allu Arha and Allu Arjun

లేడీ సూపర్‌స్టార్ అనుష్క (Anushka), ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణశేఖ‌ర్‌ (Gunasekhar) కాంబినేషన్‌లో వచ్చిన ‘రుద్రమదేవి’ (Rudramadevi) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ఆ సినిమాలో అనుష్క, రానా (Rana) వంటి వారు ఎందరు నటించినా.. ‘గోన గన్నారెడ్డి’ (Gona Ganna Reddy) పాత్రతో అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా మొత్తాని తనవైపు లాగేసుకున్నాడు. ‘గోన గన్నారెడ్డి’గా ఆయన నటన, పలికిన వాచకం.. హైలెట్‌గా నిలిచి.. ఆ సినిమాకి ఎంతో ఉపయోగపడింది. ఇప్పుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమాకు అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ (Allu Arjun Daughter Allu Arha) క్రెడిట్ మొత్తం కొట్టేస్తుంది.

Gona-Ganna-reddy.jpg

మహాభార‌తంలోని అద్భుత‌మైన ప్రేమక‌థగా చెప్పుకునే దుష్యంత‌, శ‌కుంత‌ల ప్రేమ‌గాథ‌ను మ‌హాక‌వి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం పేరుతో కావ్యంగా రాశారు. దాన్ని ఆధారంగా చేసుకుని సిల్వర్ స్క్రీన్‌పై గుణశేఖ‌ర్ రూపొందించిన విజువ‌ల్ వండ‌ర్ ‘శాకుంతలం’. పాన్ ఇండియా (Pan India) మూవీగా ఈ చిత్రం ఏప్రిల్ 14న తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ ఎత్తున విడుదలైంది. అయితే విడుదలైన అన్ని చోట్లా సినిమాకి మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ.. అల్లు అర్హ (Allu Arha) పాత్ర వరకు మాత్రం మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ (Allu Arjun Fans), ఈ సినిమా చూసిన ప్రేక్షకులు.. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్హ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఆమె పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Allu-Arha.jpg

అల్లు అర్హ ‘శాకుంతలం’ సినిమాలో చిన్న‌నాటి భ‌ర‌తుడి (Bharatha) పాత్ర‌లో నటించింది. ఆమె అప్పీయరెన్స్ ఈ సినిమాకి హైలెట్ అనేలా టాక్ నడుస్తోంది. అలాగే దేవ్ మోహన్‌ (Dev Mohan)తో ఆమె చెప్పే డైలాగ్స్, సింహంపై ఆమె వచ్చే సన్నివేశంలో.. ఎక్కడా తడబడకుండా అల్లు అర్హ నటించిందని.. సినిమా చూసిన వారంతా ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే.. సమంత చెప్పినట్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీని అల్లు అర్హ ఏలేస్తుందనేలా కామెంట్స్ చేస్తున్నారు. సినిమా చూసిన కొందరైతే.. ఆమె సన్నివేశాలని సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోలు భారీ స్పందనను రాబట్టుకుంటున్నాయి.

Allu-Arha-and-Arjun.jpg

అలాగే ‘శాకుంతలం’ షూటింగ్‌కు అల్లు స్నేహ (Allu Sneha)తో కలిసి అల్లు అర్హ వెళుతున్న ఫొటో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. మొత్తంగా మొదటి సినిమాతోనే బీభత్సమైన క్రేజ్‌ని ఈ క్యూటీ సొంతం చేసుకోవడంతో అల్లు ఫ్యామిలీ (Allu Family), అల్లు ఆర్మీ (Allu Army) ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.


ఇవి కూడా చదవండి:

*********************************

*Alia Bhatt- Ranbir Kapoor: ఏప్రిల్ 14, హ్యాపీ డే.. ఆలియా పోస్ట్ వైరల్

*Namitha: అది మన సంస్కృతి కాదు. మనకంటూ ఒక సంస్కృతి ఉంది

*Vijay Deverakonda: ‘శాకుంతలం’ విడుదల వేళ.. సమంతకు విజయ్ బూస్ట్

*KGF Actress: ‘కెజియఫ్‌’లో వణికించిన నటి.. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉంది

*Shocking: యాంకర్ సుమ అరెస్ట్.. ఎందుకంటే?

Updated Date - 2023-04-14T19:08:18+05:30 IST