Allu Arha: మహేష్ సినిమాలో.. నిజమేనా?

ABN , First Publish Date - 2023-01-04T17:30:41+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) గారాలపట్టీ అల్లు అర్హ (Allu Arha).. ‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రంతో బాలనటిగా పరిచయం కాబోతోన్న

Allu Arha: మహేష్ సినిమాలో.. నిజమేనా?
Allu Arha and Super Star Mahesh Babu

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) గారాలపట్టీ అల్లు అర్హ (Allu Arha).. ‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రంతో బాలనటిగా పరిచయం కాబోతోన్న విషయం తెలిసిందే. గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో సమంత (Samantha) టైటిల్ పాత్రలో నటించిన ‘శాకుంతలం’ చిత్రంలో.. చిన్నప్పటి భరతుడి పాత్రలో అల్లు అర్హ సందడి చేయనుంది. ఈ విషయం అధికారికంగా తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్హ మరో చిత్రంలో కూడా కనిపించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘SSMB28’ చిత్రంలో అల్లు అర్హ ఓ స్పెషల్ రోల్ చేయబోతుందనేలా.. టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తపై మేకర్స్ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. కానీ అల్లు అర్హ కోసం త్రివిక్రమ్‌ ఈ సినిమాలో మంచి పాత్రని క్రియేట్ చేశాడని, ఆ పాత్రని ఆ పాపతోనే చేయించాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లుగా అయితే టాలీవుడ్ సర్కిల్స్‌లో వినబడుతోంది.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిది రాకింగ్ కాంబినేషన్. సినిమాలపరంగానే కాకుండా.. బన్నీ, త్రివిక్రమ్‌ల మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది. ఆ బాండింగ్‌తోనే ఇప్పుడు.. మహేష్ సినిమాలో అల్లు అర్హని నటింపజేయాలని త్రివిక్రమ్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అల్లు అర్హ విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో తను చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఆమె అల్లరి చూసి.. అల్లు అర్జునే కాదు.. అల్లు ఫ్యాన్స్, ఆర్మీ (Allu Fans) కూడా ఎంతగానో మురిసిపోతుంటారు. నిజంగా మహేష్ సినిమాలో అల్లు అర్హ నటిస్తే మాత్రం.. అటు మహేష్, ఇటు అల్లు ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవనే చెప్పుకోవాలి. చూద్దాం.. మరి ఏం జరగబోతుందో? కాగా.. ఇప్పటికైతే, అర్హ విషయమై అధికారికంగా మాత్రం ఎటువంటి సమాచారం రాలేదు.

Updated Date - 2023-01-04T17:30:42+05:30 IST