తారక్, అనిల్ రావిపూడి కాంబో ఫిల్మ్ టైటిల్ ఇదేనా?
ABN , Publish Date - Nov 21 , 2026 | 03:51 PM
టాలీవుడ్లో వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో.. మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి.. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా ‘జనవరి 12 విడుదల’ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత తారక్‌ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయబోతున్నారు.
టాలీవుడ్లో వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో.. మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi).. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోలుగా ‘జనవరి 12 విడుదల’ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ రాబోయే సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. గతంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ తర్వాత అనిల్ తదుపరి చిత్రం ఎవరితో ఉంటుందా? అని రకరకాల ఊహాగానాలు నడిచాయి. చిరంజీవి, నాగార్జున కాంబోలో సినిమా ఉంటుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అలాగే బాలయ్య బాబుతో మరో సినిమా చేయబోతున్నట్లుగా టాక్ నడిచింది. అయితే ఈసారి అలాంటి సస్పెన్స్‌కు తావులేకుండా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తరహాలో తన తదుపరి చిత్రాన్ని మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)తో చేయబోతున్నట్లు అనిల్ రావిపూడి ముందుగానే ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేశారు.
ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘డ్రాగన్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ భారీ యాక్షన్ డ్రామా పూర్తయిన వెంటనే తారక్ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కనుంది. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన టైటిల్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ‘దానవీరశూర’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మాస్ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడి, ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా పక్కా కమర్షియల్ అంశాలతో పాటు ఒక బలమైన ఎమోషన్, సందేశం ఉన్న కథను సిద్ధం చేసినట్లు సమాచారం.
తెలుగు సినీ చరిత్రలో నటరత్న నందమూరి తారకరామారావు స్వీయ దర్శకత్వంలో నటించిన ‘దానవీరశూరకర్ణ’ ఏ స్థాయి చరిత్ర సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి హరికృష్ణ మనవడు, జానకిరామ్ తనయుడు ఎన్టీఆర్ కూడా బాలల చిత్రంగా అదే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు దాదాపు అదే క్లాసిక్ టైటిల్‌కు దగ్గరగా ఉండే ‘దానవీరశూర’ (Daana Veera Soora) పేరుతో తారక్ (Tarak), అనిల్ రావిపూడి సినిమా రాబోతోందన్న వార్త నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. మరి నిజంగానే ఈ సినిమాకు ‘దానవీరశూర’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తారా? లేదంటే అనిల్ రావిపూడి తనదైన మార్క్ కామెడీ అండ్ మాస్ టచ్‌తో మరో కొత్త టైటిల్ పెడతారా? అనేది తెలియాలంటే మాత్రం.. చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
‘రాకా’ విషయంలో బన్నీ ఫ్యాన్స్ ఆందోళన.. కారణమిదేనా?
గిల్ కాదు.. సారా టెండూల్కర్ పెళ్లాడేది ఆ హీరోనా?
డౌట్స్‌లో ‘గాడ్ ఆఫ్ వార్’.. త్రివిక్రమ్ నెక్ట్స్ చిత్రం ఎవరితో..