తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’ వస్తున్నాడు..

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:07 PM

భారత సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల జీవిత పోరాటం ఆధారంగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫూలే’. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.

Phule Movie Still

భారత సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే (Jyotirao Phule), సావిత్రిబాయి ఫూలే (Savitribai Phule) దంపతుల జీవిత పోరాటం ఆధారంగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫూలే’ (Phule) తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సమాజంలోని కులవివక్ష, అసమానతలు, మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతూ విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఆ ఆదర్శ దంపతుల ప్రయాణాన్ని ఈ చిత్రంలో హృద్యంగా ఆవిష్కరించారు. ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సుపదా క్రియేషన్స్ బ్యానర్‌పై డా. పొన్నం రవిచంద్ర నిర్మించారు. తెలుగు డబ్బింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుందని తెలుపుతూ మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు.


ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కులవివక్ష నిర్మూలన, మహిళా విద్య కోసం ఫూలే దంపతులు చేసిన మహోన్నత పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వారి సామాజిక సేవ, జీవిత ఆశయాలు నేటి సమాజానికి అత్యంత అవసరమైన సందేశాన్ని అందిస్తాయని అభిప్రాయపడ్డారు.


‘ఫూలే’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, సమాజంలో మార్పు కోసం పోరాడిన ఇద్దరు మహనీయులు ఎదుర్కొన్న అడ్డంకులను, వారి త్యాగాలను కళ్లకు కట్టే ఒక చారిత్రాత్మక దృశ్యకావ్యమని చిత్ర బృందం పేర్కొంది. సమానత్వం, విద్య, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి విలువలను గుర్తుచేసే ఈ చిత్రాన్ని నేటి యువత, విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూసి ఆదరించాలని, ఈ మంచి ప్రయత్నాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మీడియా సైతం సహకరించాలని మేకర్స్ విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి:

‘ఆకాశంలో ఒక తార’ డైరెక్టర్‌, హీరోయిన్‌కు అల్లు అరవింద్ బంపరాఫర్

తారక్, అనిల్ రావిపూడి కాంబో ఫిల్మ్ టైటిల్ ఇదేనా?

‘రాకా’ విషయంలో బన్నీ ఫ్యాన్స్ ఆందోళన.. కారణమిదేనా?

Updated Date - Nov 21 , 2026 | 06:07 PM

గిల్‌ కాదు.. సారా టెండూల్కర్ పెళ్లాడేది ఆ హీరోనా?

ఎమ్మెల్యే పాడెమోసిన సీఎం విజయ్..

డౌట్స్‌లో ‘గాడ్ ఆఫ్ వార్’.. త్రివిక్రమ్ నెక్ట్స్ చిత్రం ఎవరితో..

బాలీవుడ్‌కు ‘గరుడవేగ’ అంజి.. ‘అన్ఎక్స్‌పెక్టెడ్’

పెళ్లి పీటలు ఎక్కిన కుర్ర హీరో..