Allu Arjun - Atlee: కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం.. ఒక రేంజ్‌లో ఉంటుంది..

ABN , Publish Date - Oct 11 , 2025 | 01:10 PM

తాజాగా బెంగళూర్‌లో జరిగిన పికిల్‌బాల్‌ టోర్నమెంట్‌కు అట్లీ అతిథిగా హాజరయ్యారు. AA 22 గురించి అట్లీ మాట్లాడారు. సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా తమిళ దర్శకుడు అట్లీతో (Atlee) ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! పాన్ ఇండియా స్థాయిలో సన్‌పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. తాజాగా బెంగళూర్‌లో జరిగిన పికిల్‌బాల్‌ టోర్నమెంట్‌కు అట్లీ అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రం గురించి అట్లీ మాట్లాడారు సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. (AA 22)

'సినిమా అయినా,  మరో పని ఏదైనా ఒక ఆలోచనతోనే మొదలవుతుంది. ఈ సినిమాతో ప్రేక్షకులకు ఒక డిఫరెంట్‌ అనుభూతి కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆడియన్స్‌ ఆశ్చర్యపోయేలా కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం. నా గత సినిమాలు ‘రాజారాణి’, ‘తెరి’, ‘మెర్సల్‌’, ‘బిగిల్‌’, ‘జవాన్‌’ పట్ల ప్రేక్షకులు చూపించిన ప్రేమ నన్ను ఈ రోజు ఇలా ఇంత పెద్ద ప్రాజెక్టును చేయిస్తోంది. ఇదేమీ నాకు రిస్క్‌గా అనిపించడం లేదు. మేము హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌తో కలిసి పని చేస్తున్నాము. మా సినిమా వారికి కూడా సవాల్‌గా ఉంది. అల్లు అర్జున్‌ లుక్‌ మొదలు.. ఇంతవరకు చూడనటువంటి సరికొత్త కంటెంట్‌ ను ప్రేక్షకులను  అందించబోతున్నాము. మరి కొన్ని నెలల్లో మీరు ఈ చిత్రాన్ని ఆస్వాదిస్తారు. దేవుడు మా ప్రయాణంలో ప్రతి అడుగులోనూ తోడున్నాడు. ఆయన దయ వల్ల అంతా మేం అనుకున్నట్లే జరుగుతుందని ఆశిస్తున్నా. ఈ ప్రాసెస్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నా’ అని అన్నారు.  


 
అలాగే ‘కాంతార చాప్టర్‌ 1’పై గురించి ఆయన మాట్లాడారు. ఆ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ‘కాంతార 1’ను నేను మొదటి రోజు చూశాను. విదేశాల్లో ఉండడంతో థియేటర్‌కు వెళ్లడం కోసం దాదాపు రెండున్నర గంటలు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లాను. సినిమా చూడగానే రిషబ్‌కు ఫోన్‌ చేసి అభినందించా. నేను చాలా గౌరవించే వ్యక్తుల్లో రిషబ్‌ ఒకరు. ఇలాంటి సినిమాను రూపొందించడం ఎంత కష్టమో ఒక దర్శకుడిగా నాకు తెలుసు. రిషబ్‌ ఎంతోమందికి స్ఫూర్తి. ఆయన ఈ సినిమాతో మరో జాతీయ పురస్కారం అందుకుంటారని ఆశిస్తున్నా’ అని అన్నారు అట్లీ.

Updated Date - Oct 11 , 2025 | 01:53 PM