అఖిల్ బర్త్‌డే స్పెషల్‌గా.. ‘లెనిన్’ న్యూ పోస్టర్ విడుదల
ABN, Publish Date - Apr 08 , 2026 | 06:54 PM
అఖిల్ అక్కినేని ఆశలన్నీ ప్రస్తుతం ‘లెనిన్’ సినిమాపైనే ఉన్నాయి. హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఓ సాలిడ్ హిట్ కోసం ఆయన ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఆ తరహా హిట్ మాత్రం అఖిల్‌కు పడటం లేదు.
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఆశలన్నీ ప్రస్తుతం ‘లెనిన్’ (Lenin) సినిమాపైనే ఉన్నాయి. హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఓ సాలిడ్ హిట్ కోసం ఆయన ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఆ తరహా హిట్ మాత్రం అఖిల్‌కు పడటం లేదు. అందుకే, ఇప్పుడు చేస్తున్న ‘లెనిన్’ చిత్రం తన కోరికను తీర్చుతుందని ఎంతో ఆశతో ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ, ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూనే ఉంది. రీసెంట్‌గానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ (Ram Charan Peddi) సినిమా కోసం ఈ మూవీని వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ నుంచి నిర్మాతలు ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.
అఖిల్ అక్కినేని పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కినేని అభిమానులు ఈ పోస్టర్‌ను వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలియంది కాదు. ఇప్పుడొచ్చిన పోస్టర్ కూడా సోషల్ మీడియాలో మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో అఖిల్ న్యూ లుక్‌లో కనిపిస్తున్నారు. ఒక చేతిలో జెండా, మరో చేతిలో మట్టిని పట్టుకుని, మోకాళ్లపై నిలబడి ఉన్నారు. ఆయన ఫేస్‌లో రాజసం ఉట్టిపడుతోంది. అఖిల్ బర్త్‌డే స్పెషల్‌గా మేకర్స్ ఇచ్చిన ఈ ట్రీట్‌కు అక్కినేని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అఖిల్‌కు పుట్టినరోజు (HBD Akhil Akkineni) శుభాకాంక్షలు చెబుతూ.. సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్లుగా కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు.
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం.. భావోద్వేగాలతో పాటుగా ఆకట్టుకునే కథనంతో కంప్లీట్ సినిమాటిక్ ప్యాకేజీగా రూపుదిద్దుకుంటోందని చిత్రబృందం తెలుపుతోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రంతో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా రూపొందిస్తున్నారని, అలాగే థమన్ ఎస్ సంగీతం నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందని, అభిమానులకు, సినీ ప్రేక్షకులకు అద్భుతమైన ట్రీట్‌లా ఉంటుందని వారు చెబుతున్నారు. ఫైనల్‌గా ఈ చిత్రాన్ని 26 జూన్, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సడెన్‌గా నయనతారపై ట్రోలింగ్.. కారణమిదే!
రిలీజ్‌కు ముందే పది కోట్ల వ్యూస్ టార్గెట్!
కర్మయోగిని చూశా.. పవన్ కళ్యాణ్‌పై బాబీ పోస్ట్ వైరల్
ఆమనికి తెలంగాణ బీజేపీలో పదవి...