స‌డెన్‌గా న‌య‌న‌తార‌పై ట్రోలింగ్‌.. కార‌ణ‌మిదే!

ABN , Publish Date - Apr 08 , 2026 | 03:44 PM

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌ పై మ‌రోసారి సోష‌ల్ మీడియా వేదిక‌గా భారీగా ట్రోలింగ్ న‌డుస్తోంది. అంత‌కు ముందు ప‌లు విష‌యాల్లో ఆమె ట్రోలింగ్ బారిన ప‌డ్డారు. కానీ, ఇప్పుడు త‌న భ‌ర్త విగ్నేష్ శివ‌న్ విష‌యంలో ఆమెను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

Nayanthara and Vignesh Shivan

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌ (Nayanthara)పై మ‌రోసారి సోష‌ల్ మీడియా వేదిక‌గా భారీగా ట్రోలింగ్ న‌డుస్తోంది. అంత‌కు ముందు ప‌లు విష‌యాల్లో ఆమె ట్రోలింగ్ బారిన ప‌డ్డారు. కానీ, ఇప్పుడు త‌న భ‌ర్త విగ్నేష్ శివ‌న్ (Vignesh Shivan) విష‌యంలో ఆమెను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. అస‌లు విష‌యం ఏమిటంటే.. మొద‌టి నుంచి న‌య‌న‌తార, త‌ను న‌టించే సినిమాల ప్ర‌మోష‌న్స్‌కు దూరంగా ఉంటున్నారు. అందుకోసం అవ‌స‌ర‌మైతే త‌న రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకోవ‌డానికి కూడా ఆమె వెనుకాడ‌రు. ఇటీవ‌ల వ‌చ్చిన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా వచ్చిన ‘మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు’ కోసం మాత్రం కాస్త త‌న రూల్‌ని స‌డలించారు న‌య‌న‌తార. అలా అని, ఆమె ప‌బ్లిక్ ఈవెంట్స్‌లో ఏం పాల్గొన‌లేదు. ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడితో క‌లిసి రెండు వీడియోలు మాత్రం చేశారు.


అలాంటి న‌య‌న‌తార, త‌న భ‌ర్త డైరెక్ట్ చేసిన‌ సినిమా కోసం ఏకంగా స్టేజ్ పైకి రావ‌డంతో అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. త‌న భ‌ర్త విగ్నేష్ శివ‌న్ డైరెక్ట్‌ చేసిన ‘ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (Love Insurance Kompany) సినిమా ఏప్రిల్ 10న విడుద‌లకాబోతోంది. చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మంగ‌ళ‌వారం చెన్నైలో ప్రీ రిలీజ్ వేడుక‌ను గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు న‌య‌న‌తార హాజ‌రై అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. విష‌యం ఏమిటంటే, న‌య‌న‌తార ఈ వేడుక‌కు వ‌స్తున్న విష‌యం చిత్ర‌యూనిట్‌కు కూడా తెలియ‌ద‌ట‌. స‌డెన్‌గా స్టేజ్‌పైకి వ‌చ్చిన న‌య‌న‌తార, త‌న భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని, యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.  


ఈ వీడియోల‌ను చూసిన నెటిజన్లు, న‌య‌న‌తారను విమ‌ర్శిస్తూ భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసే ఇతర నిర్మాతలు నిర్మించే సినిమాల ప్ర‌మోష‌న్స్‌కు రాని నయనతార, కేవలం తన భర్త సినిమా కోసం సమయం కేటాయించడం పద్ధతి కాదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత సినిమాలకు ఒక రూల్‌, వేరే సినిమాలకు మరో రూలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మ‌రికొంద‌రేమో.. నయనతార ఎంట్రీ, అందుకు విగ్నేష్ శివన్ ఇచ్చిన రియాక్షన్.. అంతా ముందే ప్లాన్ చేసినట్లు ఉందని, ఇది కేవలం సినిమా ప్రచారం కోసం ఆడిన డ్రామా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా మ‌రోసారి ట్రోల్స్ బారిన ప‌డిన న‌య‌న‌తార‌కు మ‌రోవైపు నుంచి అభిమానుల మ‌ద్ద‌తు కూడా ల‌భిస్తోంది. ఇది త‌న సొంత సినిమా అని, ఈ సినిమాకు ఆమె కూడా ఒక సహ నిర్మాతగా వ్య‌వ‌హ‌రించారు కాబట్టి, తన సినిమాను ప్రమోట్ చేసుకునే హక్కు ఆమెకు ఉందని వారు వాదిస్తున్నారు. మొత్తంగా అయితే, మ‌రోసారి న‌య‌న‌తార టాక్ ఆఫ్ ది సోష‌ల్ మీడియాగా మారారు.

Also Read- అల్లు అర్జున్, అట్లీ.. 'రాకా' టైటిల్ అదిరింది

Updated Date - Apr 08 , 2026 | 03:46 PM