Lenin Movie: పరువు హత్యల నేపథ్యంలో.. అక్కినేని హీరో.. ?
ABN , Publish Date - Jun 18 , 2025 | 05:30 PM
అక్కినేని అఖిల్ (Akkineni Akhil ) .. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (Most Eligible Bachelor) సినిమాతో ఒక హిట్ ను అందుకున్నాడు.
Lenin Movie: అక్కినేని అఖిల్ (Akkineni Akhil ) .. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (Most Eligible Bachelor) సినిమాతో ఒక హిట్ ను అందుకున్నాడు. కెరీర్ ను మొదలుపెట్టి ఇన్నాళ్లు అవుతున్నా హీరోగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్నాడు. అక్కినేని నట వారసుడిగా ఈజీగానే టాలీవుడ్ ఎంట్రీఇచ్చినా.. విజయాన్ని అందుకొని తనంతట తాను నిలబడడానికి మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏజెంట్ (Agent) సినిమాతో ఒక మంచి విజయాన్ని అందుకుంటాడేమో అనుకుంటే అది మరింత పరాజయాన్ని అందుకుంది. ఇక దీని తరువాత అఖిల్ బాగా అలోచించి.. కొంత గ్యాప్ తీసుకొని.. లెనిన్ (Lenin) సినిమాను మొదలుపెట్టాడు.
వినరో భాగ్యము విష్ణు కథ నే సినిమాతో కిరణ్ అబ్బవరంకు మంచి విజయాన్ని అందించిన డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన శ్రీలీల నటిస్తుండగా సూర్యదేవర నాగవంశీతో కలిసి అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అఖిల్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి
ఇక అందుతున్న సమాచారం ప్రకారం లెనిన్ సినిమా పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తోంది. పరువు హత్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సంచలనాలను సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. ఇక లెనిన్ కూడా ఆ నేపథ్యంలోనే తెరకెక్కుతోందని తెలుస్తోంది. అయితే ఈ లైన్ కు తోడు ఒక ఆలయానికి సంబంధించిన కథను కూడా యాడ్ చేశారట. ఈ రెండు కథలను మిక్స్ చేసి లెనిన్ ను రూపొందిస్తున్నారని అంటున్నారు.
ఏదిఏమైనా కథను కన్విన్స్ గా చెప్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. అందులో మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఇక థియేటర్ లో బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చెప్పొచ్చు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈమధ్యనే అఖిల్ ఒక ఇంటివాడయ్యాడు. పెళ్లి తరువాత రిలీజ్ కానున్న సినిమా లెనిన్. జైనబ్ లక్ కూడా అఖిల్ కి కలిసొస్తుందని చెప్పుకొస్తున్నారు. మరి అయ్యగారు ఈ సినిమాతోనైనా ఇండస్ట్రీ హిట్ ను అందుకొని హీరోగా నిలదొక్కుకుంటాడా.. ? లేదా ..? అనేది తెలియాల్సి ఉంది.
Samantha: నాగ చైతన్యను కలిసేదే లేదు.. క్లారిటీ ఇచ్చిన సామ్